kidney
Healthy kidney : శరీరంలో మూత్రపిండాలు వెన్నెముకకు రెండు వైపులా పక్కటెముక దిగువన పిడికిలంత పరిమాణంలో ఉండే అవయవాలు. ఇవి అనేక విధులు నిర్వహిస్తాయి. ముఖ్యంగా, అవి రక్తం నుండి వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు ఇతర మలినాలను ఫిల్టర్ చేస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలు మూత్రాశయంలోకి చేరి మూత్రం ద్వారా బయటకు పంపబడతాయి. మూత్రపిండాలు శరీరంలో pH, ఉప్పు, పొటాషియం స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి.
READ ALSO : Eating Corn : కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్న
ఎముకలను నిర్మించడానికి,కండరాల పనితీరును నియంత్రించడానికి శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడే విటమిన్ డి ఉత్పత్తికి మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మనం రోజువారీగా తినే ఆహారం, తాగే పానీయాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను తినాల్సి ఉంటుంది. కొన్ని పదార్థాలను తినడం వల్ల మూత్రపిండాలు బాగా శుభ్రపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : Diabetic Nephropathy : డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవటం ఎలాగంటే ?
మూత్రపిండాల ఆరోగ్యం కోసం తినాల్సిన ఆహారాలు ;
1.నీరు ; మూత్రపిండాలను శుభ్రపరిచి, వ్యర్ధాలను బయటకు పంపటంలో నీరు అత్యంత ముఖ్యమైనది. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీటిని తీసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటికి పంపబడతాయి. సహజంగా మూత్రపిండాలను క్లీన్ చేయడంలో నీరు సహాయపడుతుంది.
2. క్రాన్ బెర్రీస్ ; ఈ పండ్లు జ్యూస్ రూపంలో తీసుకుంటే కిడ్నీలకు మేలు కలుగుతుంది. క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చూసుకోవచ్చు. మూత్రాశయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?
3. చేపలు ; సాల్మన్, ట్యూనా వంటి చేపలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, ఒమేగా -3 కొవ్వులు అధికంగా ఉండే ఈ చేపలు తినటం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించకోవచ్చు. అధిక రక్తపోటు తగ్గి మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి సాల్మన్, ట్యూనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.
4. విటమిన్ సి ; నిమ్మ, నారింజ పండ్లను పుష్కలంగా తినడం వల్ల మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటికి పంపవచ్చు. ఈ పండ్లలో అధిక స్థాయిలో సిట్రేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో దోహదపడతాయి. మూత్రంలో తక్కువ ఆమ్లాన్ని అడ్డుకుని మూత్రపిండాల ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
READ ALSO : Capsicum Helps Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడే క్యాప్సికమ్ !
5. దోసకాయలు ; ఎక్కువ శాతం నీరు ఉండే ఆహారాలలో దోసకాయ ఒకటి. దోసకాయలు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుంటా చూస్తాయి. దోసకాయలు తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
6. చిలగడదుంపలు ; చిలగడ దుంపలలో పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి మూత్రపిండాలపై దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. చిలగడదుంప అధిక పొటాషియం కలిగిన ఆహారం కాబట్టి, CKD ఉన్నవారు లేదా డయాలసిస్‌లో చేయించుకుంటున్నవారు వైద్యుల సూచనలు తీసుకుని తినటం మంచిది.
READ ALSO : కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది!
7. ముదురు ఆకుకూరలు ; బచ్చలికూర, కాలే వంటి ముదురు ఆకుకూరలు అనేక రకాల విటమిన్లు, ఫైబర్స్, ఖనిజాలను కలిగి ఉంటాయి. అనేక యాంటీఆక్సిడెంట్లు వంటి రక్షిత సమ్మేళనాలను ఈ ఆకుకూరల్లో ఉంటాయి. ఈ ఆహారాలలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని పరిమితమోతాదులో మాత్రమే తీసుకోవాలి.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.