Capsicum Helps Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడే క్యాప్సికమ్ !

కిడ్నీల ఆరోగ్యానికి క్యాప్సికమ్‌ మేలు కలిగిస్తుంది. క్యాప్సికంలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలను సురక్షితంగా ఉంచుతుంది. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తుంది.

Capsicum Helps Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడే క్యాప్సికమ్ !

Capsicum helps in keeping the kidneys healthy!

Updated On : November 10, 2022 / 9:33 AM IST

Capsicum Helps Kidneys : కిడ్నీలు హెల్తీగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే.. మిగతా భాగాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యతో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తుంది. మనం తీసుకునే ఆహారం, నీటితోనే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైన అవయం. శరీరంలో పేరుకునే వ్యర్థాలను ఎప్పటికప్పుడు కిడ్నీలు బయటకు పంపే విధులు నిర్వర్తిస్తాయి. యూరిన్‌ రూపంలో కిడ్నీలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. రక్తంలో నీరు, సాల్ట్స్‌, మినరల్స్‌‌ సమతుల్యతను నిర్వహించడానికి కిడ్నీలు తోడ్పడతాయి.

కిడ్నీలకు రక్షణగా క్యాప్సికమ్ ;

వివిధ రంగులలో లభించే క్యాప్సికమ్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. బెల్ పెప్పర్ అని కూడా పిలువబడే కూరగాయ ఇది, ఉష్ణమండల అమెరికాలో ఉద్భవించింది. దాని ఔషధ గుణాల కారణంగా ఉపయోగించబడుతుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండి అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. బీటా-క్రిప్టోక్సాంటిన్, జియాక్సంతిన్ మరియు లుటిన్ వంటి కెరోటినాయిడ్ల యొక్క ఉత్తమ మూలాలలో కూరగాయలు ఒకటి. ఇందులో విటమిన్లు, మినరల్స్ మరియు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

కిడ్నీల ఆరోగ్యానికి క్యాప్సికమ్‌ మేలు కలిగిస్తుంది. క్యాప్సికంలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలను సురక్షితంగా ఉంచుతుంది. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తుంది. క్యాప్సికమ్‌లో పొటాషియం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్‌లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వంటి వివిధ పరిస్థితుల నుండి మెరుగైన ఆరోగ్యానికి రక్షణ కలిగిస్తాయి. ఈ పోషకాలు మీ కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉండటంతో ఇది క్యాన్సర్‌‌ నుంచి రక్షిస్తుంది. రెడ్‌ క్యాప్సికమ్‌ను సలాడ్లలో, కర్రీస్‌లో వేసుకోవచ్చు.