Skin Protection : చర్మ రక్షణ కోసం దోహదపడే ప్రత్యేక ఆహారాలు ఇవే!
టమాటాల్లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు బీటా కెరోటిన్, లైకోపీన్‌లు ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తాయి. అలాగే క్యారెట్‌లో చాలా ఫైబర్ ఇంకా బీటా కెరోటిన్ లభిస్తాయి.

Food for dry skin: 14 diet tips to moisturize and protect
Skin Protection : దేహానికి రక్షణ కవచంలా చర్మం ఉపయోగపడుతుంది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతోకూడిన ఆహారం రోజువారిగా తీసుకోవటం అవసరం. ముఖ్యంగా చర్మ రక్షణకు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి-8, పాంతోతేనిక్ యాసిడ్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి పలు పోషకాలు అవసరం అవుతాయి. కొన్ని రకాల ఆహారాల ను తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చర్మ రక్షణ కోసం తీసుకోవాల్సిన అహారాలు ;
టమాటాల్లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు బీటా కెరోటిన్, లైకోపీన్‌లు ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తాయి. అలాగే క్యారెట్‌లో చాలా ఫైబర్ ఇంకా బీటా కెరోటిన్ లభిస్తాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడంలో కూడా క్యారెట్లోని పోషకాలు చాలా బాగా సహాయపడుతాయి.
రోజుకో యాపిల్‌ను తింటే చర్మాన్ని సంరక్షించుకోవచ్చన్నది కూడా అంతే నిజం. యాపిల్స్‌లో విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడనీయకుండా చూస్తాయి. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే చర్మంపై ముడతలు చాలా ఈజీగా తొలగిపోవడంతో పాటు దానిపై రంధ్రాలు ఇంకా మచ్చలు లేకుండా ముఖచర్మం చాలా మృదువుగా తయారవుతుంది.
దానిమ్మను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని చాలా ఈజీగా నియంత్రించవచ్చు. మీ చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ప్రతి రోజూ కూడా ఆహారంలో దానిమ్మను ఉపయోగించటం మంచిది. శరీంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ఫైబర్ వంటి కీలక పోషకాలు స్ట్రాబెర్రీల్లో ఉన్నాయి. ఇవి చర్మానికి కాంతిని తెస్తాయి. స్ట్రాబెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్లలా పనిచేస్తాయి. అంతేకాదు చర్మానికి హాని కలిగించే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే ఫ్లేవనాయిడ్స్ కూడా వీటిలో నిక్షిప్తమై ఉన్నాయి.
బొప్పాయిలో ఉండే పైపైన్ అనే ఎంజైమ్ మృత కణాలను తొలగిస్తుంది. అలాగే బొప్పాయి పండు చర్మ సంరక్షణకు మంచి యాంటీ ఏజెంట్‌గా పని చేస్తుంది. ప్రతి రోజూ కూడా గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరల్లో క్లోరోఫిల్ చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా ఇంకా యవ్వనంగా ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి.