Thigh Pain : కాళ్ళ పిక్కల నొప్పి బాధ… తగ్గేదెలా…
ఈ తరహా పిక్కల నొప్పులు చవిచూస్తున్నవారు కొన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. పిక్క కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఐస్ గడ్డలను కండరాలకు అద్దుతూ కాపడం పెట్టుకోవాలి దీని వల్ల నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.

Thigh Pain
Thigh Pain : కాళ్ళ నొప్పి, పిక్కలు పట్టేయటం వంటివి నిత్యం చాలా మంది ఎదుర్కొనే సమస్యలు. మోకాలు దిగువ భాగంలో కాళ్ళకు వెనుక వైపు ఉండే బలమైన కండరాలనే పిక్కలుగా చెప్తాం. ఎక్కవగా రాత్రి సమయాల్లో పిక్కల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. భరించలేని విధంగా వచ్చే ఈనొప్పి ఒక్కోసారి ఘాడ నిద్రకు భంగం కలిగిస్తుంది. కండరాలను మెలితిప్పినట్లు అనిపించే నెప్పిని భరించటం చాలా కష్టం.
అతిగా శ్రమించేవాళ్ళు, ఎక్కవ సేపు నిలబడటం, నడవటం, పొగత్రాగే అలవాటు ఉన్నవాళ్ళు, ఒకే చోట కదలకుండా కూర్చునేవాళ్ళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. రక్తనాళాలలో అవరోధాలు, నరాల మీద వత్తిడి వంటి సమస్యల కారణంగా ఈ పిక్కల నొప్పి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో మెగ్నిషియం స్ధాయిలు తక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ తరహా నొప్పులు బయటపడతాయి.
ఈ తరహా పిక్కల నొప్పులు చవిచూస్తున్నవారు కొన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. పిక్క కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఐస్ గడ్డలను కండరాలకు అద్దుతూ కాపడం పెట్టుకోవాలి దీని వల్ల నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని కాళ్ళు ఎత్తులో ఉంచుకోవాలి. కాళ్ళు బాగా చాచి అటు ఇటు కదుపుతూ తేలకపాటి వ్యాయామాలు చేస్తే నొప్పులు సర్ధుకుంటాయి.
పాలకూర, పెరుగు, గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, చేపలు, ఆకు కూరలు, కూరగాయలు వంటి ఆహార పదార్ధాలను తీసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం శరీరానికి అందటం వల్ల కండరాల నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది. సొరకాయ, బూడిద గుమ్మడి కాయలను తింటే పిక్కల నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుంది. వాత దోషకారణంగానే పిక్కల నొప్పులు వస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాంటి నొప్పులకు రక్త హీనత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.