Memory-Wiping Seizures : ఆమెకో వింత సమస్య ఉంది.. నవ్వితే మొగుడ్ని కూడా మరిచిపోతుంది..
ఆమెకో వింత వ్యాధి. ఆనందమెస్తే గట్టిగా నవ్వేస్తుంది. అంతే.. తానెవరో మర్చిపోతుంది. భర్త కూడా గుర్తుండడు. ఆమే టిక్ టాక్ స్టార్ మేఘన్ జాక్సన్.. ఐదేళ్ల క్రితం మేఘనాకు ఫంక్షనల్ న్యూరాలిజకల్ డిజార్డర్ (FND) వ్యాధి వచ్చింది.

Tiktok Star Megan Jackson Forgets Her Partner If She Laughs (1)
TikTok star Megan Jackson memory-wiping seizures : ఆమెకో వింత వ్యాధి. ఆనందమెస్తే గట్టిగా నవ్వేస్తుంది. అంతే.. తానెవరో మర్చిపోతుంది. భర్త కూడా గుర్తుండడు. ఆమే టిక్ టాక్ స్టార్ మేఘన్ జాక్సన్.. ఐదేళ్ల క్రితం మేఘనాకు ఫంక్షనల్ న్యూరాలిజకల్ డిజార్డర్ (FND) వ్యాధి వచ్చింది. అప్పటినుంచి 21ఏళ్ల మేఘన ఇదే సమస్యతో బాధపడుతోంది. ఫిట్స్ వచ్చిన ప్రతిసారి మెమరీ కోల్పోతోంది.. తరచూ మరిచిపోతున్న తన భార్యకు తానెవరో గుర్తుచేసేందుకు 22ఏళ్ల భర్త టారా సోర్కిన్ డైరీ కూడా రాస్తున్నాడంట. ఆమెకు ఫొటోలు, తమ ఫేవరేట్ సాంగ్స్ వినిపించి తిరిగి ఆమెకు గుర్తుచేస్తుండాట. ఎప్పుడైనా సంతోషంగా అనిపించినప్పుడు నవ్వితే చాలు.. ఆమె మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతో ఒక్కసారిగా న్యూరాలిజకల్ సిగ్నల్స్ మెదడకు అందక ఫిట్స్ వస్తుంటాయి.
ఈ అరుదైన వింత వ్యాధి కారణంగా తన జీవితంలో సంతోకరమైన క్షణాలను కూడా కోల్పోయింది. మెమరీ లాస్ డిసీజ్ కు ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఆర్థిక సాయం కోరుతోంది. తన వైద్య ఖర్చుల కోసం ఎవరైనా డొనేట్ చేసేందుకు GoFundMe page ను మేఘన్ లాంచ్ చేసింది. ఎన్‌హెచ్ఎస్ న్యూరాలిజిస్ట్ దగ్గరకు వెళ్లలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. ప్రతిరోజు ఎక్కువ సార్లు తనకు ఫిట్స్ వస్తుంటాయని దాంతో తాను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని వాపోతుంది. తాను ఆరోగ్యంగా ఉన్పప్పుడు మాత్రమే నవ్వాల్సి ఉందని, ఒకవేళ నవ్వితే వెంటనే ఫిట్స్ వచ్చి మెమరీ కోల్పోతున్నానంటూ చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులను మర్చిపోతుంది.
మరికొన్నిసార్లు తన స్నేహితులను మర్చిపోతుంటుంది. మెదడులో ఫిట్స్ రావడం ద్వారా తరచూ మెమరీ లాస్ అవుతున్నానని తెలిపింది. తనకిష్టమైన ఫుడ్ కూడా గుర్తుండవు.. ఈ రోజు ఏదైనా వస్తువు కొంటే మరుసటి రోజు అది ఎందుకు కొన్నానో కూడా మర్చిపోతాననంటోంది. తన 17వ ఏటా రోజుకు 35 సార్లు ఫిట్స్ వచ్చేవంట.. పూర్తిగా నడవలేదు.. కనీసం మాట్లాడలేని పరిస్థితి. అప్పుడే ఆమె ఓ న్యూరాలిజిస్టు దగ్గరకు వెళ్లి టెస్టు చేయించుకోగా FND అనే వ్యాధిని నిర్ధారణ అయింది. వెంటనే వైద్యులు ఆమెకు cognitive behavioural therapy (CBT) అవసరమని సూచించారు.
తన మెదడు కంప్యూటర్ మాదిరిగా పనిచేస్తోందని, ఒకేసారి ఎక్కువ విండోలు ఓపెన్ చేస్తే సిస్టమ్ ఎలా క్రాష్ అవుతుందో అలానే తన మెదడు కూడా క్రాష్ అవుతోందని అంటోంది. వెంటనే కిందపడిపోయి ఫిట్స్ వస్తాయంటోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాని వాపోతోంది. ప్రతిరోజు ఫిట్స్ వచ్చిన ప్రతిసారి తన మెమరీ మళ్లీ కంప్యూటర్ లా రీసార్ట్ అవుతుందని, దాంతో డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకున్న సంగతి కూడా మర్చిపోతున్నానని అంటోంది. దాంతో తన రిలేషన్స్ కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని తెలిపింది. తనకు సాయంగా గర్ల్ ఫ్రెండ్ శాంచియా ఉంటోందని, తనకోసం రోజూ డైరీ రాస్తోందని, అన్ని తన ఫోన్ లో నోట్ చేస్తుంటుందని తెలిపింది.