Blood Clots : రక్తం గడ్డకట్టకుండా పాటించాల్సిన చిట్కాలు

రక్తం గడ్డకట్టకుండా నివారించటంలో వెల్లుల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. వెల్లల్లిని పచ్చిగా లేదంటే కూరల్లోనో భాగం చేసుకుని తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

Blood Clots : రక్తం గడ్డకట్టకుండా పాటించాల్సిన చిట్కాలు

Blood Thinner

Updated On : January 24, 2022 / 12:40 PM IST

Blood Clots : రక్తం గడ్డకట్టడం అన్నది చాలా ప్రమాదకరమైనది. కొన్ని పర్యాయాలు ఆకస్మాత్తుగా జరిగే ఈ పరిణామం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉంటాయి. రక్తం గడ్డకట్టటం వల్ల స్ట్రోక్, గుండె దడ, రక్తం గుండెపోటు ,అధిక రక్తపోటుకు దారితీస్తుంది. సహజమైన చిట్కాల ద్వారా రక్తం గడ్డకట్ట కుండా అరికట్టవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తం గడ్డకట్టకుండా అరికట్టడంలో అల్లం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేసే అత్యుత్తమ సహజ సిద్దమైన వస్తువు. యాంటిఆక్సిడెంట్ మరియు కడుపు మంట విరుగుడికి సంబంధించి ఎన్నో ఔషధ గుణాలు అల్లంలో పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్తం గడ్డకట్టకుండా నియంత్రిస్తుంది. అల్లాన్ని టీగా గాని లేకుంటే ఆహారంలో భాగం చేసుకుని కాని తీసుకోవచ్చు.

రక్తం గడ్డకట్టడాన్ని అరికట్టడానికి అత్యుత్తమమైనది దాల్చిన చెక్క. రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టడమే కాకుండా, తెలియకుండా రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డ కట్టి ఉంటే, వాటిని కరిగించడంలో కూడా దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది. మీరు తీసుకొనే ఆహారంలో క్రమం తప్పకుండా దాల్చిన చెక్కను వినియోగించడం వల్ల రక్తం గడ్డకట్ట కుండా పూర్తిగా అరికట్టవచ్చు.

కడుపులో మంటకు విరుగుడుగా మరియు రక్తాన్ని పలుచన చేసే గుణాలు పసుపులో అధికముగా ఉంటాయి. మీరు తినే ఆహారంలో తరచూ పసుపుని వేసుకోవడం వల్ల మీ శరీరంలో రక్తం గడ్డకట్ట కుండా అరికట్టవచ్చు. పిప్పరమెంటు లో విటమిన్ కె అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా జరగడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండటానికి పిప్పరమెంటు ఎంతగానో ఉపయోగపడుతుంది.

రక్తం గడ్డకట్టకుండా నివారించటంలో వెల్లుల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. వెల్లల్లిని పచ్చిగా లేదంటే కూరల్లోనో భాగం చేసుకుని తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. మిరియాలను దంచి పాలల్లో వేసి మరిగించుకుని తాగటం వల్ల అందులో ఉండే గుణాలు రక్తాన్ని చిక్కబడ కుండా చేస్తాయి.

ప్రతిరోజు వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రక్తం గడ్డకట్టే పరిస్ధితులు ఉండవు. ప్రతిరోజు చేయకపోయినా వారానికి 3 రోజుల పాటు గంట వ్యవధి చొప్పున వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓమేగా 3 కొవ్వు అమ్లాలు అధికంగా ఉండే చేప ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది.

ఆహారపదార్ధాల్లో ఆలివ్ అయిల్ ను వినియోగించటం మంచిది. ఇది రక్తాన్ని గడ్డకట్టకుండా చూస్తాయి. ప్రతిరోజు కొద్ది మొత్తంలో ద్రాక్షాకాని లేదంటే రెడ్ వైన్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. అయితే అధిక మోతాదులో వైన్ సేవించటం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించాలి.