Foxtail Millet : ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే కొర్ర బియ్యంతో!

కొర్రలు  శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. నడుముకు మంచి శక్తిని ఇస్తాయి. నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు. ఊపిరితిత్తులకు సంభవించే ఇన్ఫెక్షన్లను, న్యుమోనియాను, మధుమేహ రోగులు బాధపడే అరికాళ్ళ మంటలను, స్పర్శ కోల్పోవడం వంటి పరిస్థితులను నయం చేస్తాయి.

Foxtail Millet : ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే కొర్ర బియ్యంతో!

Foxtail Millet

Updated On : July 20, 2022 / 2:56 PM IST

Foxtail Millet : చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. కొర్రలు తీపి, వ‌గ‌రు రుచిని క‌లిగి ఉంటాయి. క‌డ‌పునొప్పి, మూత్రంలో మంట‌, ఆక‌లి లేక‌పోవడం, అతిసారం వంటి స‌మ‌స్యల‌కు కొర్రల‌ు చక్కని పరిష్కారం చూపిస్తాయి. వీటిని నిత్యం తినడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పీచు పదార్ధం అధికంగా వుండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్ర గంజి తాగితే జ్వరం తగ్గిపోతుందని నమ్మకం. గుండెజబ్బులు, రక్తహీనత, ఉబకాయం, కీళ్ళవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.

అల్జీమర్స్ ను తగ్గించి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచటంలో తోడ్పడతాయి. నాడీవ్యవ‌స్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విట‌మిన్ వీటిలో ల‌భిస్తుంది. బెల్స్ పాల్సీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఎంత‌గానో సహాయపడుతుంది. చిన్నపిల్లల‌కు, గ‌ర్భిణిల‌కు మంచి ఆహారం. ఉద‌ర సంబంధ వ్యాధుల‌కు కొర్రలు తినడం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మాంసకృతులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. కొర్రల్లో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తాన్ని వృద్దిచేస్తుంది.

కొర్రలు  శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. నడుముకు మంచి శక్తిని ఇస్తాయి. నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు. ఊపిరితిత్తులకు సంభవించే ఇన్ఫెక్షన్లను, న్యుమోనియాను, మధుమేహ రోగులు బాధపడే అరికాళ్ళ మంటలను, స్పర్శ కోల్పోవడం వంటి పరిస్థితులను నయం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ సహాయపడుతుంది. కొర్రల‌ను రెగ్యుల‌ర్‌గా తిన‌డం వ‌ల్ల కొన్ని ర‌కాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులు, మ‌తిమ‌రుపు క‌నిపించ‌వు. నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహరం కొర్ర బియ్యంగా నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి కాన్సర్, ఉపిరితిత్తుల కాన్సర్, ఉదర కాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్తమా నివారించడంలో సైతం కొర్ర బియ్యం తోడ్పడుతాయి.