Look Younger : యంగ్ గా కనిపించడం కోసం.. అలవాట్లు కూడా కీలకమే !

పెరిగే వయసును ఎవరూ ఆపలేరు. రివర్స్ చేయనూ లేరు. ముఖంలో ముడతలు, శరీరంలో ఇతర సంకేతాలు కనిపించక మానవు. అయినా సరే వయసు మీద పడినట్టు కనిపించకుండా, యంగ్ గా ఉండొచ్చు.

Look Younger

Look Younger : యాభయ్యేళ్లు వచ్చాయో లేదో… ఇక వయసైపోయింది… అనుకునేవాళ్లు ఇంతకుముందు. అరవైలో పడ్డారంటే ఇక కృష్ణా రామా అనుకోవాల్సిన వయసు అనే నిర్ధారణకు వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆలోచనా ధోరణి మారింది. వయసు శరీరానికే గానీ మనసుకు కాదనుకుంటున్నారు. అన్నింటికీ మించి యంగ్ గా కనిపించాలన్న తాపత్రయం చాలామందిలో కనిపిస్తున్నది.

READ ALSO : Nutritious Food : చర్మ సహజ కాంతిని కోల్పోతున్నారా? అయితే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం బెటర్ !

కొందరు నాలుగు పదుల్లోనే అరవైలో పడ్డట్టుగా కనిపిస్తే, మరికొందరు 60 ఏళ్ల వయసులో కూడా యంగ్ గా ఉంటారు. ఇందుకు కొంతవరకు జన్యుతత్వం కారణమైనప్పటికీ, మన అలవాట్లు కూడా కీలకమే. పెరిగే వయసును ఎవరూ ఆపలేరు. రివర్స్ చేయనూ లేరు. ముఖంలో ముడతలు, శరీరంలో ఇతర సంకేతాలు కనిపించక మానవు. అయినా సరే వయసు మీద పడినట్టు కనిపించకుండా, యంగ్ గా ఉండొచ్చు. కొందరు అలా ఉండగలుగుతారు కూడా. వయసు పెరిగినా కూడా చాలా స్ట్రాంగ్ గా, చురుగ్గా కనిపిస్తారు. సాధారణంగా వాళ్లు అనుసరించే జీవనశైలి, మానసిక స్వభావం ఇందుకు దోహదపడుతాయి.

ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం, క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం నిద్ర. ఎంత సేపు పడుకున్నామనేదానికన్నా, ఎంత నాణ్యమైన నిద్ర పట్టిందనేదే చాలా ముఖ్యం. ఒత్తిళ్లు, టెన్షన్లతో సతమతమయ్యేవాళ్లకు ఆరోగ్యకరమైన నిద్ర కష్టమే. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడం ఇంకా చెప్పాలంటే మనసులోకి ఆ ఒత్తిడిని తీసుకోకపోవడం వల్ల సగం అనారోగ్యాలు మటుమాయం అవుతాయి. ఇందుకోసం కొంచెం సాధన అవసరమంటారు నిపుణులు.

READ ALSO : Spiny Gourd : వర్షాకాల సీజన్ లో ఆగాకర ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు !

యూత్ గా ఫీలవడం, యంగ్ గా కనిపించడం కోసం నిపుణులు సూచిస్తున్న విషయాలు :

వ్యాయామం

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. శరీరం చురుగ్గా ఉంటుంది. శరీరంలోని అవయవాల డీజనరేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల అవయవాలు యంగ్ గా ఉంటాయి. మనసు ఉత్సాహంగా ఉండటం వల్ల మానసికంగా కూడా చురుగ్గా ఉండి, యంగ్ గా ఫీలవుతారు. వ్యాయామం ఫిట్ నెస్ ను పెంచుతుంది. గుండె లాంటి అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు బలంగా ఉంటాయి.

ఆహారం

ఆరోగ్యం కావాలంటే ఆహారం సరిగ్గా ఉండాల్సిందే. అన్ని అనారోగ్యాలకూ ప్రధాన చికిత్స ఆహారమే అంటారు నిపుణులు. మంచి ఆహారం తీసుకుంటే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. కనీసం వాయిదా వేయవచ్చు. అందుకే రకరకాల పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగని కొవ్వు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన ఎసెన్షియల్ఫాటీ యాసిడ్స్ ఉన్న కొవ్వు పదార్థాలను తీసుకోవచ్చు. ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగరీ స్నాక్స్ కి దూరంగా ఉండండి.

READ ALSO : Risks of Eating Too Fast : చాలా స్పీడ్‌గా ఆహారం తింటున్నారా? బీ కేర్ ఫుల్

సుఖనిద్ర

ఆధునిక కాలంలో లేట్ నైట్ పార్టీలు, మొబైల్స్ లో చాట్స్, ఓటీటీలో వెబ్ సిరీస్… ఇవన్నీ మన నిద్రను చెడగొడుతున్నాయి. కాబట్టి వీటి కన్నా నిద్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ప్రతిరోజూ రాత్రి పూట 7 నుంచి 9 గంటల పాటు సుఖ నిద్ర ఉండేలా మీ బయోలాజికల్ క్లాక్ కి అలవాటు చేయండి. మీ బెడ్ రూమ్ ని బాగా నిద్ర పట్టడానికి అనుకూలంగా మలచుకోండి.

ఒత్తిడి

అధిక ఒత్తిడి అన్ని రకాలుగా మనపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సాధ్యమైనంతవరకు ఒత్తిడి కలగకుండా మీ పనులను సెట్ చేసుకోండి. సమయపాలన పాటిస్తే సగం ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు సహాయపడుతాయి.

READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !

బంధం.. అనుబంధం

మనిషి సంఘజీవి. కాబట్టి తోటి మనుషుల్లో ఎంతగా కలిస్తే మనం అంత సంతోషంగా ఉంటాం. కుటుంబ సభ్యులతో తగినంత టైం స్పెండ్ చేయండి. స్నేహితులను ఏర్పరుచుకోండి. బలమైన సామాజిక సంబంధాలను కొనసాగించండి. తరచుగా స్నేహితులు, బంధువులను కలుస్తూ ఉండండి. మానసికంగా ఉత్సాహం కలిగే ప్రోగ్రామ్స్ అటెండ్అవండి.

ట్రెండింగ్ వార్తలు