Pumpkin Health Benefits : గుమ్మడికాయ అనేది కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన శీతాకాలంలో విరివిగా లభించే పంట. సాధారణంగా దీనిని చాలా మంది కూరగాయగా పరిగణిస్తారు. గుమ్మడికాయ శాస్త్రీయంగా ఒక పండుగా చెప్పవచ్చు. ఇందులో విత్తనాలు ఉంటాయి. ఇది పండ్ల కంటే కూరగాయలతో సమానమైన పోషకాహారంగా నిపుణులు చెబుతున్నారు. రుచికి మించి, గుమ్మడికాయ ఎంతో పోషకమైనది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
READ ALSO : Diwali 2023 : దీపావళి రోజు చేపల కూర నైవేద్యంగా పెట్టే వింత ఆచారం
గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు ;
చర్మ ఆరోగ్యానికి ;
గుమ్మడికాయలు లుయెటిన్ , జెక్సాంటిన్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించటంలో సహాయపడతాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటంలో ;
గుమ్మడికాయ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కెరోటినాయిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రొమ్ము, కడుపు, గొంతు ,ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.
READ ALSO : Jest born Babies : చంటిబిడ్డలు ఏడ్చినా కన్నీళ్లు రావు ఎందుకో తెలుసా..? వెరీ ఇంట్రస్టింగ్
గుండె ఆరోగ్యానికి ;
గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం కలిగి ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంతో పాటు వివిధ శారీరక క్రియలకు అవసరపడతాయి. గుండెకు మేలు చేసే మంచి కొవ్వులను పెంచటంలో ఉపకరిస్తాయి.
కంటి చూపును పెంచటంలో ;
రోగనిరోధక వ్యవస్ధకు సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా దీనిలో ఉండే విటమిన్ సి మీ కళ్ళకు సహాయపడుతుంది. వృద్ధులలో కంటి చూపు క్షీణించటాన్ని నివారిస్తుంది.
READ ALSO : United States : ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన గుమ్మడికాయ.. దానికి ఎవరి పేరు పెట్టారో తెలుసా?
బరువు తగ్గడం ;
గుమ్మడికాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధిక మొత్తంలో కేలరీలను తీసుకోవటాన్ని నిరోధించవచ్చు. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో ;
గుమ్మడికాయ గ్లూకోజ్ నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో , గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది.
READ ALSO : గుమ్మడికాయ.. ఔషధాల గని..ప్రయోజనాలు ఎన్నో..
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ;
గుమ్మడికాయలో కాల్షియంతో సహా ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం ఎముకలు ఆరోగ్యానికి, దంతాల నిర్మాణానికి సహాయపడుతుంది. విటమిన్లు ఎ , సి ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.