United States : ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన గుమ్మడికాయ.. దానికి ఎవరి పేరు పెట్టారో తెలుసా?

ఇది అలాంటి ఇలాంటి గుమ్మడి కాయ కాదు.. బరువు 1,246.9 కేజీలు. ప్రపంచ రికార్డు సాధించిన ఈ గుమ్మడికాయకు ఎవరి పేరు పెట్టారో తెలుసా?

United States : ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన గుమ్మడికాయ.. దానికి ఎవరి పేరు పెట్టారో తెలుసా?

United States

United States : యుఎస్‌లోని మిన్నోసోటాకు చెందిన హార్టి కల్చర్ టీచర్ ట్రావిస్ గింగెర్ పెంచిన భారీ గుమ్మడి కాయ ప్రపంచ రికార్డు సాధించింది. హాఫ్ మూన్ బేలో జరిగిన 50వ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో 1,246.9 కేజీల బరువుతో రికార్డు సాధించిన ఈ గుమ్మడికాయకు ఎవరి పేరు పెట్టారో తెలుసా?

Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు

2021 లో ఇటలీకి చెందిన స్టెఫానో కుట్రుపి 1,226 కిలోల గుమ్మడికాయను పండించి రికార్డు సాధించగా.. దానికి 21.3 కిలోల అదనపు బరువుతో గుమ్మడికాయను పండించి గింగెర్ పాత రికార్డును తిరగరాసారు. ఈ గుమ్మడికాయకు బాస్కెట్ బాల్ లెజెంట్ మైఖేల్ జోర్డాన్ పేరు పెట్టాడట గింగెర్.

మొదట ఈ గుమ్మడికాయ బాస్కెల్ బాల్ లాగ రౌండ్‌గా కాయడం మొదలుపెట్టిందట. 43 సంవత్సరాల గింగెర్ ఏప్రిల్ నెలలో తన పెరట్లో గుమ్మడికాయలను పెంచడం మొదలుపెట్టాడట. సీజన్ మొత్తం రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్లు ఇలాంటి సవాళ్లను ఎదుర్కుని మరీ ఈ గుమ్మడికాయను పెంచగలిగాడట. అక్టోబర్ 7 న అతని స్నేహితులతో కలిసి ఈ భారీ గుమ్మడికాయను ట్రక్‌లోకి ఎక్కించారు. అక్టోబర్ 9 న జరిగిన 50 వ భారీ గుమ్మడికాయ ఛాంపియన్ షిప్ పోటీల కోసం కాలిఫోర్నియాకు తరలించారట.

Bigest onion : ఉల్లిగడ్డ వరల్డ్ రికార్డ్ .. ఒక్క ఉల్లిపాయ 9 కిలోలు

ఈ పోటీలో విజేతగా నిలిచిన గింగెర్‌ $30,000 (సుమారు రూ. 25 లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు. చిన్నతనం నుంచి గుమ్మడికాయలంటే ఎంతో ఇష్టం ఉన్న గింగెర్ ఈ పోటీలో గెలిచి విజయం సాధించాడు. గతేడాది కూడా ఇతను 1,161 కేజీల గుమ్మడికాయను పెంచాడట.

 

View this post on Instagram

 

A post shared by Travis Gienger (@travispumpkins)