Jest born Babies : చంటిబిడ్డలు ఏడ్చినా కన్నీళ్లు రావు ఎందుకో తెలుసా..? వెరీ ఇంట్రస్టింగ్

నవజాత శిశువులు ఏడ్చినప్పుడు మీరు గమనించారా..? పెద్దవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ చంటిబిడ్డలు ఏడిస్తే కళ్ల వెంట నీళ్లు రావు. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కారణముంది...

Jest born Babies : చంటిబిడ్డలు ఏడ్చినా కన్నీళ్లు రావు ఎందుకో తెలుసా..? వెరీ ఇంట్రస్టింగ్

babies dont produce tears

Updated On : November 11, 2023 / 1:18 PM IST

babies dont produce tears : చంటిబిడ్డలకు ఆకలేస్తే చాలు గుక్కపట్టి ఏడ్చాస్తారు. ఇంకేముంది..? అమ్మ మనస్సు విలవిల్లాడిపోతుంది. చనుబాటు బిడ్డ నోటికి అందించి ఆకలి తీరుస్తుంది..కానీ నవజాత శిశువులు ఏడ్చినప్పుడు మీరు గమనించారా..? పెద్దవాళ్లు ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ చంటిబిడ్డలు ఏడిస్తే కళ్ల వెంట నీళ్లు రావు. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కారణముంది…

ఓ చిన్న నలుసుగా అమ్మ కడుపులో పిండంగా ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలోకి వచ్చిన నవజాత శిశువు ఒక్కసారిగా గుక్కపట్టి ఏడుస్తుంది..తను ఈలోకంలోకి వచ్చిన వెంటనే ఏడుపుతోనే తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆకలి వేసినా.. వేయకపోయినా ఏడుస్తారు. అలా ఏడిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు. పుట్టిన బిడ్డ ఏడవకపోతే తల్లితో పాటు డాక్టర్లు కూడా ఆందోళన చెందుతారు. బిడ్డ ఏడవటానికి డాక్టర్లు రకరకాల టెక్నిక్ లు వాడతారు. బిడ్డ ఏడిస్తే హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ చంటిబిడ్డలు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావో తెలుసా..?

World first Eye Transplant : కనురెప్పతో సహా కన్ను మార్పిడి చేసిన డాక్టర్లు .. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన సర్జరీ

దీనికి కారణం బిడ్డలు పుట్టినప్పుడు వారికి కన్నీటి నాళాలు పూర్తిగా ఏర్పడవు. కన్నీళ్ల పరిమాణం వారి కళ్ళ నుంచి కారడానికి సరిపోదు.అందుకే వారు ఏడ్చినా కన్నీళ్లు రావు. బిడ్డలు పుట్టిన రెండు లేదా మూడు నెలల వయస్సు తర్వాత కన్నీళ్లు ఏర్పడతాయి..ఆ తరువాతే వారికి కన్నీళ్లు వస్తాయి.

బిడ్డలు పుట్టినప్పటి నుంచి వారి శరీరం అభివృద్ధి విషయంలో చాలా మార్పులు ఏర్పడుతుంటాయి. ఒక్కో నెలా పెరిగే కొద్దీ వారి శరీరం ఎన్నో నేర్చుకుంటుంది. బిడ్డ శరీరం రకరకాలుగా అభివద్ది చెందుతుంటుంది. ఇది ఏడాది వయస్సు వరకు జరుగుతుంటుంది.  ఏడాది వయస్సులో బిడ్డలు రకరకాలుగా మారుతుంటారు. ఎన్నో నేర్చుకుంటుంటారు. బోర్లా పడటం..చిన్న చిన్నగా ఊకలు కొట్టటం..అంటే ఊ..ఊ అంటూ ముద్దు ముద్దుగా ఊకలు కొట్టటం..కూర్చోవటం, పాకటం..నిలబడటం..బుడి బుడి అడుగులు వేయటం ఇలా వారి ఏడాది కాలంలో ఎన్నో మార్పులు మనం గమనించవచ్చు. ఈ మార్పులు చూసి తల్లి ఎంతో సంబరపడిపోతుంది. నా బంగారు కొండ అంటూ మురిసిపోతుంది. తల్లి చెందే ఆ ఆనందాల ముందు ఈ లోకంలో ఏదీ సాటి రాదు.

బిడ్డలో వస్తున్న మార్పులు గమనించి మురిసిపోయే తల్లి బిడ్డ ఏడిస్తే మాత్రం తల్లిడిల్లిపోతుంది. బిడ్డ కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క కారినా ఆమె గుండె విలవిల్లాడిపోతుంది. కానీ ఏడుపు కూడా ఓ వరమే నంటారు. ఏడిస్తే కళ్లల్లో ఉండే కల్మషాలు కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఇదిలా ఉంటే బిడ్డలు పుట్టిన కొన్ని నెలల వరకు కన్నీళ్లు రాకపోవానికి కారణం వారి శరీర అభివృద్ధికి సంబంధించినదే కావటం అది ప్రకృతి సిద్ధంగా జరిగే మార్పుల్లో భాగం.

Delay in Pregnancy : గర్భధారణలో అలస్యమా ! అలాంటి సమయంలో ఏంచేయాలి.. నిపుణుల సూచనలు ఇవే ?

ఎవరైనా ఏడ్చినప్పుడు  కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక కారణంగా ఉంటుంది. నవజాత శిశువులో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. అది ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువుకు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే కన్నీళ్ల రావడం ప్రారంభమవుతాయని చిన్నపిల్లల నిపుణులు చెబుతున్నారు.నవజాత శిశువులకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా ఏడ్చేస్తారు. వారు అసౌకర్యానికి గురవుతున్నారనటానికి వారి ఏడుపే అని అర్థం చేసుకోవాలి.  కానీ వారికి కన్నీళ్లు రావడానికి కొన్ని వారాలు పడుతుందని శిశువైద్యురాలు చెబుతున్నారు. కొంతమంది పిల్లలకు వాహిక అభివద్ది చెందాలంటే సమయం ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు..

కంటి ఎగువ కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంధి ఉంటుంది. ఈ గ్రంథి నుండే కన్నీళ్లు వస్తాయి. ఈ గ్రంథి కళ్లలో తేమను గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ల కదలిక తేలికవుతుంది. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగానూ, నాళం గొట్టంలా కూడా వ్యవహరిస్తుందని..దీని ద్వారా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చంటి బిడ్డలకు ఇది అభివృద్ధి చెందటానికి సయమం పడుతుంది. అందుకే నవజాత శిశువులు ఏడ్చినా కన్నీళ్లు రాకపోవటానికి కారణం అదేనని చెబుతున్నారు నిపుణులు.