World first Eye Transplant : కనురెప్పతో సహా కన్ను మార్పిడి చేసిన డాక్టర్లు .. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన సర్జరీ

కఠినమైన ఆపరేషన్లను కూడా సునాయంగా మార్చి రోగులకు కొత్త జీవితాలను ఇస్తున్నాడు డాక్టర్లు.దీంట్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత కఠినతమైన ఆషరేషన్ చేసి ఓవ్యక్తికి కొత్త రూపునిచ్చారు డాక్టర్లు.

World first Eye Transplant : కనురెప్పతో సహా కన్ను మార్పిడి చేసిన డాక్టర్లు .. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన సర్జరీ

World first Eye Transplant

Updated On : November 10, 2023 / 3:02 PM IST

World first Eye Transplant In US : వైద్య రంగంలో వస్తున్న పెను మార్పులో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నాయి. కఠినమైన ఆపరేషన్లను కూడా సునాయంగా మార్చి రోగులకు కొత్త జీవితాలను ఇస్తున్నాడు డాక్టర్లు.దీంట్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత కఠినతమైన ఆషరేషన్ చేసి ఓవ్యక్తికి కొత్త రూపునిచ్చారు అమెరికా డాక్టర్లు. సాధారణంగా కన్ను ఆపరేషన్ అంటే శుక్లాల ఆపరేషన్ వంటివి చేస్తుంటారు. కానీ ఏకంగా కనురెప్పతోపాటు కన్ను మార్పిడి ఆపరేషన్ చేయటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. దాన్ని విజయవంతంగా చేశారు న్యూయార్క్ డాక్టర్లు.

న్యూయార్క్‌‌లోని లాంగోన్‌హెల్త్‌ హాస్పిటల్ డాక్టర్లు హైవోల్టేజీ విద్యుత్ తీగలను తాకి పెను ప్రమాదానికి గురైన 46 ఏళ్ల అరన్ జేమస్ అనే వ్యక్తికి గత మేలో కన్ను మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు.దాదాపు 21 గంటలపాటు చేసిన ఈ కన్ను మార్పిడి ఆపరేషన్ ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆరేషన్  అని చెబుతున్నారు. కానీ మార్పిడి చేసిన కంటికి చూపు వస్తుందా..?లేదా అనేది కొంతకాలం గడిస్తేనే గానీ చెప్పలేమంటున్నారు.

Short Hair : జుట్టు పొట్టిగా ఉన్న మహిళలపై దాడి .. యువకుడు చెప్పే సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..

అంధత్వంతో బాధపడుతున్నవారికి కొత్త లోకాన్ని చూపిస్తున్న డాక్టర్లు దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటి శస్త్రచికిత్సలు ఎన్నో చేస్తున్నారు. కానీ ఏకంగా పూర్తిగా కన్ను మార్పిడి చేసిన ఈ సరికొత్త ఆపరేషన్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత కఠినమైనది చెబుతున్నారు ఆరన్ కు సర్జరీ చేసిన డాక్టర్ల బృందం. ఈ సర్జరీ భవిష్యత్తులో మరెన్నో సరికొత్త సర్జరీలకు నాంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా..కన్ను మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆరన్ జేమ్స్ 2021లో ప్రమాదవశాత్తూ 7200 హైవోల్టేజీ విద్యుత్ తీగలను తాకటంతో అతని మొహం బాగా కాలిపోయింది. ముఖం దాదాపు మొత్తం కాలిపోయింది.ఒక కన్ను మొత్తం పోయింది. దీంతో లాంగోన్‌హెల్త్‌ హాస్పిటల్ లో 140మంది డాక్టర్ల బృందం 2023 మే 27న ఈ అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం జేమ్స్ బాగా కోలుకున్నాడని అతని కన్ను ప్రస్తుతానికి బాగానే ఉందని కానీ చూపు వస్తుందో లేదో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాలని డాక్టర్ ఎడ్యురాడో రోడ్రిగ్వెజ్ తెలిపారు. 30 ఏళ్ల ఓ వ్యక్తి నుంచి సేకరించిన కన్నుతో  పాటు దాత మజ్జె (బోన్ మ్యారో) నుంచి సేకరించిన మూలకణాలను ఆప్టిక్ నర్వ్ లోకి పంపించి జేమ్స్ త్వరగా కోలుకునేలా చేశామని తెలిపారు.

Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

గతంలో అమెరికా మిలటీలో పనిచేసిన జేమ్స్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. తనకు కన్నుదానం చేసిన దాతకు, కష్టమనుకున్న ఈ అద్భుతమైన ఆపరేషన్ చేసిన డాక్టర్లకు తాను తన కుటుంబం రుణపడి ఉంటామని తెలిపారు. ఒకవేళ ఆ కంటికి చూపు వచ్చినా రాకపోయినా దాని స్పర్శ అనేది మాత్రం తెలుస్తోందని తెలిపారు.  మార్పిడి చేసిన కన్ను మూసి తెరవటం ప్రస్తుతానికి సాధ్యం కావటలేదని తెలిపాడు.