Short Hair : జుట్టు పొట్టిగా ఉన్న మహిళలపై దాడి .. యువకుడు చెప్పే సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..

జుట్టు పొట్టిగా ఉన్న మహిళలు, యువతులపై ఓ యువకుడు దాడి చేస్తున్నాడు. అటువంటివారు కనిపిస్తే చాలు పిచ్చెక్కి రెచ్చిపోతున్నాడు. వాళ్ల జుట్టు పట్టుకుని లాగి కొడుతున్నాడు.

Short Hair : జుట్టు పొట్టిగా ఉన్న మహిళలపై దాడి .. యువకుడు చెప్పే సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..

Man Attacks Woman For Having Short Hair

Man Attacks Woman For Having Short Hair : జుట్టు పొట్టిగా ఉన్న మహిళలు, యువతులపై ఓ వ్యక్తి దాడి చేస్తున్నాడు. అటువంటివారు కనిపిస్తే చాలు పిచ్చెక్కి రెచ్చిపోతున్నాడు. వాళ్ల జుట్టు పట్టుకుని లాగి కొడుతున్నాడు. ఈ వింత ప్రవర్తనతో మహిళలపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. కారణం గురించి విచారిస్తే దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. అతనికి జుట్టు పొట్టిగా ఉన్న మహిళల్ని స్త్రీవాదులుగా భావిస్తాడ. అందుకే వారిపై దాడులకు పాల్పడుతున్నాడట..అతని చెప్పే కారణం విని పోలీసులు కూడా షాక్ అయ్యారు..దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన ఇదేం లాజిక్కురా బాబు జుట్టు పొట్టిగా ఉన్నవారు స్త్రీవాదులు అని ఎలా అనుకుంటావురా నాయనా అనేలా ఉంది.

దక్షిణ కొరియాలోని ఆగ్నేయ నగరంలోని జింజ లోని ఓ షాపులో గత శనివారం జరిగిందీ ఘటన. ఆషాపుకు వచ్చిన 20 ఏళ్ల యువకుడు ఆ స్టోర్ లో పనిచేస్తున్న మహిళపై దాడికి తెగబడ్డాడు. ఆమె జుట్టు పట్టుకుని లాగి కొట్టాడు. గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఆ స్టోర్ లో ఉన్న 50 ఏళ్ల వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. అతనికి ఆపటానికి యత్నించగా.. అతనిపై కూడా దాడి చేశాడు. ఆమె అతని నుంచి బలవంతంగా తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నాడు.

Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

అతనిని పోలీసులు విచారించగా ఆమె జుట్టు పొట్టిగా ఉంది. ఫెమినిస్టులా ఉంది..అందుకే కొట్టాను అని చెప్పాడు. ఆమె కూడా తననకు అతను కొడుతున్నప్పుడు “నీకు చిన్న జుట్టు ఉంది కాబట్టి, నువ్వు స్త్రీవాది అయి ఉండాలి. నేను మగ చావినిస్ట్‌ని, స్త్రీవాదులు దాడికి అర్హులని నేను భావిస్తున్నాను. అని గట్టిగా అరిచాడని చెప్పింది. సదరు బాధితురాలిపై దాడి చేసిన యువకుడ మద్యం మత్తులో ఉన్నాడని..గతంలో అతడిని స్కిజోఫ్రెనియా గా గుర్తించి చికిత్స అందించామని తెలిపారు.

కాగా..జపాన్ లో స్త్రీవాద భావజాలం గురించి ఇటువంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2021లో.. టోక్యో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్, ఉమెన్స్ టీమ్ ఈవెంట్‌లలో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న ఆర్చర్ ఆన్ సాన్ పొట్టి జుట్టు ఉన్న కారణంగా ఫెమినిస్టు అనే ఆరోపణలను కూడా ఎదుర్కొవటం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆన్ సాన్ చదివేది ఓ ఉమెన్ యూనివర్శిటీలో.

కాగా జపాన్ లో పొట్టి జుట్టు ఉన్నవారిని ఫెమినిష్టులని అనటం దాడులు చేయటంపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. ఇటువంటి ఘటనలు జరిగిప్పుడు ఫెమినిస్టులనే ముద్రతో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భాల్లో ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాముల ద్వారా పొట్టిజుట్టుతో ఉన్న యువతులు పోస్టుల ద్వారా తమ నిరసనను తెలియజేస్తుంటారు. ఈ ఫోటోలకు నా బాడీ నా ఇష్టం..నా జుట్టు నా ఇష్టం…నా చాయిస్ నా హక్కు అని రాస్తు పొట్టి జుట్టు ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంటారు.