Delay in Pregnancy : గర్భధారణలో అలస్యమా ! అలాంటి సమయంలో ఏంచేయాలి.. నిపుణుల సూచనలు ఇవే ?

గర్భధారణలో జాప్యం జరుగుతుంటే ఆహారం, వ్యాయామం , అలవాట్లు వంటి అంశాలతో సహా జీవనశైలిని నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే అవి సంతానోత్పత్తిపై గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

Delay in Pregnancy : గర్భధారణలో అలస్యమా ! అలాంటి సమయంలో ఏంచేయాలి.. నిపుణుల సూచనలు ఇవే ?

Delay in Pregnancy

Delay in Pregnancy : పిల్లలు పుట్టకపోవటాన్నివంధ్యత్వంగా చెబుతాం. గర్భవతి కావడానికి ప్రయత్నించినప్పటికీ ఒక సంవత్సరం తర్వాత గర్భం దాల్చలేకపోవడాన్ని గర్భధారణలో జాప్యంగా చెప్పవచ్చు. దీనినే లేట్ కాన్సెప్షన్ గా చెబుతారు. దీనర్ధం ఇక జీవితాంతం వారు గర్భందాల్చే అవకాశం ఉండదని మాత్రం కాదు. అండోత్సర్గ రుగ్మతలు, ఎండోమెట్రియోసిస్, తక్కువ స్పెర్మ్ కౌంట్ , తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలతో సహా అనేక అంతర్గత సమస్యల కారణంగా గర్భధారణలో ఆలస్యం అవుతుంది.

READ ALSO : Honey Benefits : శీతాకాలంలో గొంతు నొప్పి, దగ్గు వంటి ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షణ కలిగించే అమృతం ఇదే !

వంధ్యత్వానికి సంబంధించిన ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. దీనిని ముందస్తుగా గుర్తించటం ద్వారా సరైన చికిత్సలు పొందవచ్చు. తద్వారా గర్భదారణకు అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. ప్రస్తుతం వైద్యచికిత్సా విధానంలో అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. గర్భదారణ సకాలంలో రాలేదన్న ఆందోళనలో ఉన్న వారు ఏమాత్రం ఆందోళన చెందకుండా అసలు కారణాలను గుర్తించి వాటికి పరిష్కారాలను వైద్యుల సూచనలు, సలహాల ద్వారా కనుగొనటం వల్ల మంచ ప్రయోజనం ఉంటుంది.

నిపుణులు చెబుతున్న ప్రకారం గర్భదారణ జరగకపోవటం చాలా మందిలో పలు విధాలుగా వేధించే సమస్య. ఈ సమస్యను దీనిని గుర్తించటం అన్నది చాలా కీలకం. గర్భం ధరించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే అలాంటి వారు అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Ayurvedic Fertility Supplements : గర్భధారణకు ఆయుర్వేద సంతానోత్పత్తి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా ? ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలు తప్పవా ?

1. వైద్య నిపుణులను సంప్రదించటం : గర్భం దాల్చని పరిస్ధితని ఎదుర్కొంటుంటే పునరుత్పత్తి ఆరోగ్యంలో నైపుణ్యం కలిగిన నిపుణుడిని అనగా గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

2. ప్రాథమిక సంతానోత్పత్తి పరీక్ష : గర్భం ధరించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంతర్లీన సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్రాథమిక సంతానోత్పత్తి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఇవి వైద్యుల సూచనలు, సలహాల మేరకు చేయించుకోవాలి.

3. వయస్సు-సంబంధిత సంతానోత్పత్తి సమస్యలు: వయస్సు కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వైద్యులను సంప్రదించి వయస్సు ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవటం మంచిది. వైద్యులు ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తారు.

READ ALSO : Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారు..?

4. జీవనశైలి : గర్భధారణలో జాప్యం జరుగుతుంటే ఆహారం, వ్యాయామం , అలవాట్లు వంటి అంశాలతో సహా జీవనశైలిని నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే అవి సంతానోత్పత్తిపై గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

5. మానసిక ఆరోగ్యం: వంధ్యత్వానికి గురిచేసే వాటిలో మానసిక సమస్యలు కూడా కారణం. అనేక సమస్యలు, సవాళ్ల కారణంగా గర్భధారణలో జాప్యం చోటు చేసుకోవచ్చు. వైద్యులను సంప్రదించి మానసిక ఆరోగ్యం గురించి సరైన కౌన్సిలింగ్ తీసుకోవటం మంచిది.

READ ALSO : coloring hair during pregnancy : గర్భధారణ సమయంలో జుట్టుకు రంగు వేయడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుందా ?

6. సంతానోత్పత్తి నిపుణుల సలహాలు : ప్రత్యేక పరిస్థితుల్లో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సంతానోత్పత్తి , పునరుత్పత్తి ఆరోగ్యంలో నైపుణ్యం కలిగిన వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం చాలా కీలకం. వంధ్యత్వం అనేది ఒక సాధారణ సమస్య అని గుర్తుంచుకోవాలి. సరైన మార్గదర్శకత్వంలో చికిత్స పొందిన చాలా మంది దంపతులు ఆ సమస్య నుండి బయటపడ్డారు.