Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కలకలం..! ఆపరేషన్ సిందూర్ 6 నెలల తర్వాత.. ఉగ్రదాడులకు కుట్ర?
నిఘా వర్గాల ప్రకారం.. సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు చొరబాటు యత్నాలు ముమ్మరం చేశాయి.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో మళ్లీ కలకలం రేగింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్.. జమ్ముకశ్మీర్ లో దాడులకు కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ ఎస్ఎస్ జీ, ఐఎస్ఐ సాయంతో ఆయా సంస్థల ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. టెర్రరిస్ట్ షంషేర్ ఆధ్వర్యంలోని టీమ్.. డ్రోన్ల ద్వారా ఎల్ వోసీ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసిందని చెప్పాయి. క్రాస్ బార్డర్ అటాక్స్ చేసేందుకు పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించాయి.
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కర మూకలు పని పట్టాయి మన దళాలు. ఇది జరిగిన 6 నెలల తర్వాత, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM) దాడులకు సిద్ధమవుతున్నాయని నిఘా వర్గాల నివేదిక సూచించింది.
నిఘా వర్గాల ప్రకారం.. సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు చొరబాటు యత్నాలు ముమ్మరం చేశాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (SSG), ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సాయంతో నియంత్రణ రేఖ (LoC) వెంబడి చొరబాటు మార్గాల ద్వారా టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం.
ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని ఎల్‌ఇటి యూనిట్.. డ్రోన్లను ఉపయోగించి వైమానిక నిఘా నిర్వహించిందని, ఎల్‌ఓసి గ్యాప్స్ గుర్తించిందని, ఇది రాబోయే రోజుల్లో ఫిదాయీ తరహా దాడులు లేదా ఆయుధాలు వదిలేందుకు సూచన అని నిఘా వర్గాలు తెలిపాయి.
ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం, మాజీ SSG సైనికులు, ఉగ్రవాదులతో కూడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ (BATలు) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా తిరిగి మోహరించబడ్డాయి. ఇది భారత స్థావరాలపై సరిహద్దు దాడులు జరిగే ప్రమాదాన్ని సూచిస్తుంది. జమ్ముకశ్మీర్ లో అస్థిరతను రేకెత్తించడమే లక్ష్యంగా పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని అనుమానిస్తున్నారు.
Also Read: ఇంత దారుణంగా అవమానిస్తారా? రెండెకరాల పంట పోతే రూ.6 నష్టపరిహారం ఇస్తారా?.. పొట్టుపొట్టు తిట్టిన రైతు
