కరోనా వాక్సిన్‌కు ఒక్క అడుగు దూరం.. మహమ్మారి అంతమైనట్టే..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేయాల్సిందే.. వ్యాక్సిన్ వస్తే తప్పా కరోనా మహమ్మారిని అంతం చేయలేం. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ అత్యవసరమని అందరిలోనూ ఇదే అభిప్రాయం. దీనిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ గుడ్ న్యూస్ చెబుతోంది.
కరోనా వ్యాక్సిన్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్నామంటోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలన్నా మిలియన్ల మంది ప్రాణాలు కాపాడాలన్నా వ్యాక్సిన్ ఎంతో అత్యవసరం. వ్యాక్సిన్ లక్ష్యానికి ఒక అడుగు దూరంలో ఉన్నామంటోంది పరిశోధక బృందం. ChAdOx1 nCoV-19 (AZD1222) అనే వ్యాక్సిన్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇటీవలే రిలీజ్ చేసింది. AstraZeneca భాగస్వామ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.
ప్రాథమిక డేటాలో ఈ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని రుజువైంది. వాలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ ద్వారా వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. సమర్థవంతమైన సురక్షితమైన వ్యాక్సిన్ అంటోంది ఆక్స్ ఫర్డ్.. తమ గోల్ రీచ్ అవడానికి కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నామని అంటోంది. ట్రయల్స్‌లో మనుషులకు వ్యాక్సిన్ ఇవ్వడం ఇదే మొదటిసారిగా పేర్కొంది. 543 మంది ఆరోగ్యకరమైన వారిలో 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి ChAdOx1 nCoV-19 సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపింది.
వీరిలో కొంతమందికి స్వల్ప స్థాయిలో రియాక్షన్స్ వచ్చినట్టు పేర్కొంది. వ్యాక్సిన్ ఇచ్చిన చోట చర్మంపై ఎర్రగా మారడం, స్వల్ప నొప్పి ఉన్నట్టుగా గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి రోగనిరోధక వ్యవస్థ (యాంటీ బాడీస్, టీ సెల్స్ స్థాయిలు) పెరిగాయని, కనీసం 12 నెలల వరకు పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపింది.
అంతేకాదు… వీరిలో కోవిడ్-19 వైరస్ ప్రబలుతుందో లేదో చూడా పర్యవేక్షించినట్టు తెలిపింది. వ్యాక్సిన్ 28 రోజుల్లో యాంటీబాడీ రెస్పాండ్‌ను ప్రేరేపిస్తుందని ప్రాథమిక డేటాలో తేలింది. వ్యాక్సిన్ వ్యాప్తి నుంచి ఎక్కువ మందిని రక్షించగలదని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఈ టీకా ఎలా పనిచేస్తుంది? :
వ్యాక్సిన్లు.. బ్యాక్టీరియా వైరస్‌ల వంటి వ్యాధికారక ఏజెంట్లను గుర్తించి పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. వ్యాక్సిన్లు అనేవి.. రోగనిరోధక వ్యవస్థను ఒక రోగక్రిమి సులభంగా గుర్తించదగిన భాగంతో రూపొందిస్తారు. రోగనిరోధక వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది.
తద్వారా భవిష్యత్తులో అదే రోగక్రిమిని ఎదుర్కొంటే ఇమ్యూనిటీ సిస్టమ్ త్వరగా స్పందిస్తుంది. SARS-CoV-2 అభివృద్ధి అవుతున్న చాలా టీకాలు.. వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్ లక్ష్యంగా రూపొందిస్తున్నాయి. ఈ ప్రోటీన్ ACE2 అనే పేరుతో పిలుస్తారు. ఇది దాని ఉపరితలం ద్వారా మానవ కణాలలోకి వైరస్ అనుమతించేలా చేస్తుంది.