Vitamin B12 : విటమిన్‌ B12 లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే? లోపాన్ని నివారించాలంటే ?

పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే బి12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది.

Vitamin B12 : విటమిన్‌ B12 లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే? లోపాన్ని నివారించాలంటే ?

Vitamin B12 :

Updated On : January 8, 2023 / 3:29 PM IST

Vitamin B12 : శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో విటమిన్ B12 ఒకటి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరుకు దోహదం చేస్తుంది. ఇది లోపిస్తే నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా అలసట.., శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండెదడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బి12 తక్కువగా ఉండడం వల్ల హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ లెవల్స్ చాలా వరకు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు విటమిన్‌ బి12 అవసరం. శరీరంలోకి చేరిన పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడానికి విటమిన్‌ బి12 అవసరం. ఈ జీవక్రియ ఫలితంగా శక్తి పుంజుకుని, శరీరంలోని నిస్సత్తువ వదులుతుంది. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఇది జుట్టు కుదుళ్లకు ఎర్ర రక్తకణాలును తీసుకువెళ్తుంది. ఈ ఎర్ర రక్త కణాలు హెయిర్ ఫోలికల్స్‌కు చేరితే కొత్త వెంట్రుకలు ఏర్పడేందుకు సహాయపడుతుంది పాత జుట్టుకు కూడా పోషణనిస్తుంది. మన శరీరంలో విటమిన్‌ B12 ఎక్కువ అయితే జుట్టు రాలే సమస్య అధికమవుతుంది.

పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే బి12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది. శాకాహారులు పెరుగు, ఓట్స్, సోయాబీన్స్, బ్రోకలీ, టోఫు లాంటివి తినడం ద్వారా కొంతవరకు ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఇదే కాకుండా శాకాహారులు నిపుణుల సలహాతో విటమిన్ బి 12 సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది.