ఉగాది అంటే ఏమిటి.. ఎలా జరుపుకోవాలి?
ఉగాది అంటే తెలుగింటి తొలి పండుగ. ఈ పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది. ఇది చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది.

ఉగాది అంటే తెలుగింటి తొలి పండుగ. ఈ పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది. ఇది చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది.
ఉగాది అంటే తెలుగింటి తొలి పండుగ. ఈ పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది. ఇది చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో ఇది తెలుగువారి పండుగ అయ్యింది. ఈరోజునే.. బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే జరిగింది. ఉగాది పండగకు సంబంధించి ఇలాంటి ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఉన్నాయి.
Read Also : బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి
ప్రకృతి పరంగా చూస్తే… కొత్త మార్పులు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మావిడి పిందెలు, వేపపూత.. అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. పూల పరిమళాలతో గుబాళించే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉగాది పండుగను పిలుస్తారు.. జరుపుకుంటారు. ఉగాది పచ్చడి రుచి మారొచ్చు… కానీ ఎక్కడైనా ప్రకృతిలోని మార్పులు ఎంత సహజమో జీవితంలో కష్టసుఖాలూ అంతే సహజమని ప్రకృతి సాక్షిగా చాటిచెప్పడమే ఉగాది పండగ ముఖ్యఉద్దేశం.
ఇలా జరుపుకోవాలి:
ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. తలకు నువ్వుల నూనె పట్టించాలి. నలుగు పిండితో స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. ఇష్టమైన దేవుడికి పూజ చేయాలి. టిఫిన్ కంటే ముందే.. ఉగాది పచ్చడిని ప్రసాదంగా తినాలి. ఉదయం లేదా సాయంత్రం వీలును చూసుకుని గుడికి వెళ్లాలి. ఎందుకంటే.. ఉగాది రోజంతా ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. రాశులు, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇది నిజామా – కల్పితమా అనేది పక్కనపెడితే.. పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి. పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుందంటారు పెద్దలు.
Read Also : ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత