ఏప్రిల్ 24.. జీరో షాడో డే.. ఫుల్ ఎంజాయ్

ఏప్రిల్ 24 (బుధవారం) 2019.. ఈ రోజు బెంగళూరు సిటీలో ఎవరూ తమ రియల్ షాడో (నీడ)ను చూడలేరు.

  • Published By: sreehari ,Published On : April 24, 2019 / 01:04 PM IST
ఏప్రిల్ 24.. జీరో షాడో డే.. ఫుల్ ఎంజాయ్

Updated On : April 24, 2019 / 1:04 PM IST

ఏప్రిల్ 24 (బుధవారం) 2019.. ఈ రోజు బెంగళూరు సిటీలో ఎవరూ తమ రియల్ షాడో (నీడ)ను చూడలేరు.

ఏప్రిల్ 24 (బుధవారం) 2019.. ఈ రోజు బెంగళూరు సిటీలో ఎవరూ తమ రియల్ షాడో (నీడ)ను చూడలేరు. నగరవాసులంతా ఈ రోజును ‘జీరో షాడో డే’గా సెలబ్రేట్ చేసుకున్నారు. సిటీలోని జహహార్ లాల్ నెహ్రూ ప్లానెటేరీయంలో అందరూ జీరో షాడే డేను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12:18 గంటల సమయానికి బెంగళూరులో ఎండలో నిలబడినట్టయితే.. దాదాపు మీ నీడ అదృశ్యం కావడం గమనించే ఉంటారు.
Also Read : ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

ఎందుకుంటే ఈ రోజుంతా బెంగళూరులో సూర్యుడు నడినెత్తినే ఉంటాడు. ఇలాంటి అద్భుతమైన అరుదైన ఘటన ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరుగుతుంది. సూర్యుడు భూమి మధ్యభాగంలో ఉత్తరం నుంచి దక్షిణం దిశగా పయనిస్తాడు. సరిగ్గా మధ్యాహ్నం 12:18 గంటల సమయంలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఆ సమయంలో మనిషి నీడ.. క్రమంగా వారి అరికాళ్ల కిందకి వెళ్లిపోతుంది. మీ తలకు కుడిభాగాన పాదాల అంచునకు కొద్దిమాత్రంగా నీడ మాత్రమే కనిపిస్తుంది.  అందుకే మీ నీడను మీరు చూడలేరు. దీన్ని జీరో షాడే డే గా పిలుస్తారు.
Why Bengaluru is Observing zero Shadow Day on April 24, 2019

జీరో షాడో డేను సెలబ్రేట్ చేసుకునేందుకు బెంగళూరులో నెహ్రూ ప్లానేటేరియంలో వర్క్ షాపు నిర్వహించారు. 2018 ఏడాదిలో జీరో షాడో డే వర్క్ షాపులో 50 మంది విద్యార్థులు పాల్గొనగా.. 400 మంది జీరో షాడే డేను గమనించేందుకు తరలి వచ్చారు. ఈ ఏడాది కూడా వర్క్ షాపును 8వ తరగతి, హైయర్ క్లాసు చదివే విద్యార్థులతో నిర్వహించినట్టు ప్లానటేరియం డైరెక్టర్ ప్రమోద్ గాల్గాలి తెలిపారు.
Why Bengaluru is Observing zero Shadow Day on April 24, 2019

మరోవైపు జీరో షాడో డేను చెన్నైలో మధ్యాహ్నం 12:07 గంటలకు అక్కడివారంతా నిశితంగా గమనించారు. ఇతర నగరాలైన మంగళూరు, న్యూ ఢిల్లీ, జైపూర్ సిటీల్లో కూడా వివిధ సమయాల్లో జీరో షాడో డేను సెలబ్రేట్ చేసుకున్నారు. జీరో షాడో డే కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Why Bengaluru is Observing zero Shadow Day on April 24, 2019
Why Bengaluru is Observing zero Shadow Day on April 24, 2019
Why Bengaluru is Observing zero Shadow Day on April 24, 2019