Betel Leaf : తమలపాకును తొడిమతో కలిపి ఎందుకు తినకూడదు?

రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే , డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు.

Betel Leaf : తమలపాకును తొడిమతో కలిపి ఎందుకు తినకూడదు?

Green betel leaves are hanging on the tree. It is a creeper plant, in Asia which is eaten as tobacco with betel nut. Green leaf background

Updated On : October 24, 2022 / 7:32 AM IST

Betel Leaf : తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్య పరంగా తమలపాకును విరివిగానే ఉపయోగిస్తారు. ఇతర విషయాలను పక్కన పెడితే తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి. ఎందుకంటే తమలపాకు తొటిమ తినడం వల్ల స్త్రీలలో సంతాన సమస్యలు, పురుషుల్లో లైంగిక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు రావడానికి అనేక రసాయనాలు ఇందులో ఉంటాయి. కాబట్టి సంతానం కావాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా తొడిమలు తీసి వేసి తమలపాకు తినాలి.

అంతేకాదు రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే, డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తమలపాకులు ఎప్పుడూ కూడా లేతగా తాజాగా ఉన్న వాటిని మాత్రమే తినాలి.