దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 07:06 AM IST
దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు

Updated On : October 19, 2019 / 7:06 AM IST

దీపావలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు ఏదైనా ఒక గాజు సీసా తీసుకుని దాన్ని ఉప్పుతో నింపాలి, తర్వాత ఆ సీసాని ఇంట్లో ఏదో ఒక మూలన గాని, స్నానం చేసే గదిలో గాని పెడితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలు అన్ని బయటకు పోయి, లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని ఒక నమ్మకం. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలంటు కొట్టి పారేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇది నిజం. 

ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ముందుగా దిష్టీ తీయడం మన ఇళ్లల్లో సాధారణం విషయం. అయితే అలా దిష్టి తీయడానికి ఉపయోగించే వస్తువులలో ఉప్పు ముందుంటుంది, ఇంట్లో ఎవరికయినా దిష్టి తగిలినట్టు అనిపిస్తే, గుప్పెడు ఉప్పుని తీసుకుని దిష్టి తగిలిన వారిపై మూడు సార్లు తిప్పి పడేయడం చూస్తూ ఉంటాం. అంతేకాదు స్నానాల గదిలో ఒక మూల గాజు బౌల్ తో ఉప్పుని పెడితే, వాస్తు దోషం ఉండదట. ఇలా చాలా మంది చేస్తుంటారు.  

సాధారణ ఉప్పు కంటే కళ్లుప్పుని తీసుకుని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దాన్ని ఇంటి ముఖద్వారానికి కడితే దానికింద నుంచి ఇంట్లోకి ఎలాంటి శక్తులు రాకుండా అంతా మంచి జరుగుతుందట. మనసులో ఏమైనా ఆందోళన ఉన్నా కూడా పోతుంది.  

ఈ మూటని వ్యాపార స్థలంలో ముఖద్వారంతో పాటు, మీ బీరువాలో కూడా పెట్ట్టుకోవాలట. అలా చేయడం వలన వ్యాపారంలో మంచి లాభం వస్తుందని పెద్దలు చెప్పేవారు.
పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్ళలో వేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే, సుఖ నిద్ర పట్టడమే కాకుండా అంతా మంచి జరుగుతుందట. పిల్లలకు వారానికి ఒకసారి చిటికెడు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయిస్తే రోగాలు ఎక్కువగా రావని చెబుతున్నారు.