సింధూరం, మంగళసూత్రమేనా పెళ్లికి గుర్తు? ఇది పాతకాలం మనస్తత్వం, ఏకిపారేస్తున్న ట్విట్టర్ యూజర్స్

  • Published By: Chandu 10tv ,Published On : July 3, 2020 / 07:16 PM IST
సింధూరం, మంగళసూత్రమేనా పెళ్లికి గుర్తు? ఇది పాతకాలం మనస్తత్వం, ఏకిపారేస్తున్న ట్విట్టర్ యూజర్స్

Updated On : August 12, 2020 / 5:09 PM IST

గౌహతి హైకోర్టు ఇటీవల ఒక వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. ఆ వ్యక్తి పెళ్లికి గుర్తులైన సింధూరం, మంగళసూత్రం తన భార్య పెట్టుకోవటానికి నిరాకరించిందని, ఆమెకి పెళ్లి అంటే ఇష్టం లేదనే కారణంతో విడాకులు తీసుకున్నాడు. దీంతో గౌహతి కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ కేసు తీర్పుపై కొంతమంది ట్విట్టర్ యూజర్లు స్పందిస్తూ పెళ్లికి గుర్తులైన సింధూరం, మంగళసూత్రం లేకుండా ఉన్న కొన్ని ఫోటోలను #WithoutSymbolsOfMarriage అనే హ్యాష్ ట్యాగుని ఉపయోగించి షేర్ చేస్తున్నారు.

కొంతమంది మహిళలు తమ పెళ్లి రోజు నుంచి సింధూర్, మంగళసూత్రం, గాజులు ధరించకుండా కనిపించే కొన్ని సెల్ఫీలను త్రోబాక్ చిత్రాలు అనే పేరుతో ట్విట్టర్లలో షేర్ పంచుకున్నారు. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న మహిళలు అన్ని ధరిస్తారు అని పేర్కొన్నారు.

మరికొందరు పెళ్లి గుర్తులు లేకుండా మేము వివాహం చేసుకొన్ని ఆనందంగా జీవిస్తున్నాం , గౌరవనీయ హైకోర్టు అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరొకరు ‘మంగళసూత్రం, ఆభరణాలు,సిందూరం లేకుండా మేము టిస్ హజారీ కోర్టులో పెళ్లి చేసుకున్నాం’అని తన పెళ్లి రోజు ఫోటోను పంచుకున్నారు.


గౌహతి హైకోర్టు జూన్ 19 విడాకుల కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, ‘ఆమె సింధూరం, మంగళసూత్రం ధరించటానికి నిరాకరించటం, ఆ పెళ్లి వల్ల ఆమె సంతోషంగా లేదని, ఈవిధమైన తన ప్రవర్తన వివాహన్ని కొనసాగంచటం ఇష్టం లేదని తెలుపుతుంది’.