Young Drivers: మ్యూజిక్ వింటుంటే డ్రైవింగ్ ఎబిలిటీ మెరగవుతుందని ఫీల్ అవుతున్న యంగ్ డ్రైవర్లు

నెగెవ్‌కు చెందిన బెన్ గురియోన్ యూనివర్సిటీ రీసెర్చర్లు డ్రైవింగ్ అనేది మ్యూజిక్ లేకుండా అసాధ్యం..

Young Drivers: మ్యూజిక్ వింటుంటే డ్రైవింగ్ ఎబిలిటీ మెరగవుతుందని ఫీల్ అవుతున్న యంగ్ డ్రైవర్లు

Young Drivers Find Music Is A Must As More Stimulus Helps Their Driving Ability

Updated On : April 22, 2021 / 12:57 PM IST

Young Drivers: నెగెవ్‌కు చెందిన బెన్ గురియోన్ యూనివర్సిటీ రీసెర్చర్లు డ్రైవింగ్ అనేది మ్యూజిక్ లేకుండా అసాధ్యం అంటున్నారు. సైకోమ్యూజికాలజీ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. మ్యూజిక్, మైండ్, బ్రెయిన్ ల గురించి చాలా పాజిటివ్ అంశాలు కనిపించాయి.

18 నుంచి 29 ఏళ్లు మధ్య వయస్సున్న యంగ్ డ్రైవర్లు కార్లో మ్యూజిక్ ను ఎంటర్ టైన్మెంట్ గా ఫీల్ అవడం లేదు. అదేదో కార్లోని ఓ పార్ట్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్లు ఒంటరిగా ఉన్నా ఇంకెవరితో ఉన్నా అలాగే ఫీల్ అవుతున్నారని ప్రొఫెసర్ వారెన్ బ్రాడ్ స్కై అంటున్నారు.

రోజు మొత్తం ఒకేలా ఉండేందుకు భారీ మొత్తంలో ఇన్ఫర్మేషన్ పొందేందుకు అది ఉపయోగపడుతుంది. ఇంకా కారులో వినే మ్యూజిక్ ఎలాంటిదనే ప్రశ్నలు ఉండవు కానీ, అది వారి ప్రవర్తనపై ఆధారపడి మాత్రం ఉంటుంది. కొన్ని సార్లు పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇజ్రాయెల్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీసెర్చ్ యూనివర్సిటీ అయిన బీజీయూ.. హ్యూమన్ బిహేవియర్ పై జరిపిన స్టడీలో ఇలా వెల్లడించింది. మ్యూజిక్ అనేది అవసరం, యూనివర్సల్ లాంగ్వేజి అందరం దానిని అప్రిషియేట్ చేయాల్సిందే. స్టడీ ఫలితాలు కూడా నిస్సంకోచంగా ఇదే చెప్తున్నాయి.