Secunderabad Brs Mp Candidate : కేసీఆర్ కీలక నిర్ణయం.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు

అటు సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

Secunderabad Brs Mp Candidate : కేసీఆర్ కీలక నిర్ణయం.. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు

Secunderabad Brs Mp Candidate : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ ఎమ్మెల్యేని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావుగౌడ్ పేరుని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. పద్మారావు గౌడ్ గతంలో ఎక్సైజ్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు.

సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు, బస్తీ వాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ ను సరైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారని వెల్లడించాయి.

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేదానిపై కొన్ని రోజులుగా పార్టీలో జోరుగా చర్చలు సాగాయి. ఇవాళ కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. పద్మారావు గౌడ్.. తన నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి చేశారని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత అని కేసీఆర్ చెప్పారు. పద్మారావు గౌడ్ విజయానికి పార్టీ నేతలంతా పని చేయాలని కేసీఆర్ సూచించారు.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి కొత్త పేరు.. ఎవరీ శ్రీశరణ్? ఎందుకు ఈడీ గాలిస్తోంది?