2023 Sankranti Cinema Fight
Sankranti Cinema Fight: 2023 సంక్రాంతికి పందెం కోళ్ళతో పాటు స్టార్ హీరోలు కూడా బరిలో ఎదురు నిలవబోతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”, తమిళ హీరో విజయ్ బై లింగువల్ మూవీ “వారసుడు” ప్రకంటించగా, ఆ తరువాత చిరంజీవి “వాల్తేరు వీరయ్య” కూడా బరిలో నిలవబోతున్నట్లు ప్రకంటించారు.
Balayya – Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్, త్రివిక్రమ్.. హింట్ ఇచ్చిన బాలయ్య
తాజాగా ఈ పందానికి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని నిన్న సినిమా టైటిల్ ప్రకటిస్తూ ధ్రువీకరించింది చిత్ర యూనిట్. దీంతో ఈ పెద్ద పండక్కి పోటీ కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నాలుగు సినిమాలు విడుదలవుతున్న అందరి దృష్టి బాలయ్య “వీరసింహా రెడ్డి”, చిరు “వాల్తేరు వీరయ్య” సినిమాలపైనే ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య ఇటువంటి పోటీ నెలకొన్నప్పటికీ, ఈసారి మాత్రం ప్రత్యేకం. ఎందుకంటె ఈ రెండు చిత్రాల్లో వింటేజ్ చిరు, బాలయ్యలను గుర్తుచేసేలా పాత్ర చిత్రీకరణ ఉండడం. మరి ఈ ఎపిక్ క్లాష్ లో విజయం ఎవరిది కానుందో చూడాలి.
కాగా జనవరి 12న చిరు “వాల్తేరు వీరయ్య”, ప్రభాస్ “ఆదిపురుష్”. జనవరి 13న బాలయ్య “వీరసింహా రెడ్డి”, విజయ్ “వారసుడు” విడుదలకు సిద్ధమవుతున్నాయి. చిత్ర నిర్మాతలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా థియేటర్ల సర్దుబాటు జరుగుతుందని చెబుతున్నప్పటికీ, సూపర్బ్ టాక్ వచ్చినవి మాత్రమే నిలబడతాయి మరియు ఇతరులు నష్టపోక తప్పదు.