22 ఏళ్ళ ఎగిరేపావురమా
1997 జనవరి 30న రిలీజ్ అయిన ఎగిరే పావురమా 2019 జనవరి 30 నాటికి 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

1997 జనవరి 30న రిలీజ్ అయిన ఎగిరే పావురమా 2019 జనవరి 30 నాటికి 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో, పి.ఉషారాణి నిర్మాతగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్.. ఎగిరే పావురమా.. 1997 జనవరి 30న రిలీజ్ అయిన ఈ సినిమా, 2019 జనవరి 30 నాటికి 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాతే శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై, స్రవంతి రవికిషోర్ పలు సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసాడు. జె.డి.చక్రవర్తి, శ్రీకాంత్, లైలా మెయిన్ లీడ్స్‌గా రూపొంది, లవ్, సెంటిమెంట్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎగిరే పావురమా ఫ్యామిలీ ఆడియన్స్‌నీ, యూత్‌నీ బాగా ఆకట్టుకుంది.
సల్లాపం అనే మలయాళ సినిమాకిది రీమేక్.. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతమందించిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. టైటిల్ సాంగ్, మాఘమాసం, గుండె గూటికి, ఆహా ఏమిరుచి వంటి పాటలు చాలా బాగుంటాయి. సుహాసిని, నిర్మలమ్మ, బ్రహ్మానందం, బాబూ మోహన్, శివాజీ రాజా, తనికెళ్ళ భరణి తదితరులు నటించిన ఈ సినిమాకి కథ : లోహిత్ దాస్, మాటలు : మరుధూరి రాజా, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం : ఎస్వీ కృష్ణారెడ్డి.
వాచ్ మాఘమాసం సాంగ్…