Oscar Eligible list : ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో 301 సినిమాలు.. ఇండియా నుంచి ఏమేమి ఉన్నాయో తెలుసా??

ప్రతి సంవత్సరం ఆస్కార్ ఈ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేస్తుంది. అందులో నుంచి ఓటింగ్ తర్వాత కొన్ని సినిమాలని మాత్రమే ఆస్కార్ నామినేషన్స్ కి తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో మొత్తం 301 సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ ని...........

Oscar Eligible list :  సినిమా వాళ్లందరికీ ఆస్కార్ ఓ కల. ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో అయినా స్థానం సాధించాలని చాలా సినిమాలు కలగంటాయి. ప్రతి సంవత్సరం ఆస్కార్ ఈ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేస్తుంది. అందులో నుంచి ఓటింగ్ తర్వాత కొన్ని సినిమాలని మాత్రమే ఆస్కార్ నామినేషన్స్ కి తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో మొత్తం 301 సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ ని అకాడమీ రిలీజ్ చేసింది.

ఇక ఈ లిస్ట్ లోకి ఇప్పటికే అందరూ అనుకున్నట్టు RRR, అధికారికంగా పంపిన లాస్ట్ ఫిలిం షో సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు గంగూభాయ్ కతీయవాడి, ఆల్ దట్ బ్రీథ్స్, ది కశ్మీర్ ఫైల్స్, రాకెట్రీ, విక్రాంత్ రోనా.. సినిమాలు ఉన్నాయి. ఈ 301 సినిమాలకి జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి.

RRR For Oscars : దయచేసి ‘ఆర్‌ఆర్ఆర్’ని ఆస్కార్స్‌కి గుర్తించండి.. హాలీవుడ్ నిర్మాత!

ఈ 2023 ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండాలంటే ఏ సినిమా అయినా 1 జనవరి 2022 మరియు 31 డిసెంబర్ 2022 మధ్య థియేట్రికల్ రిలీజ్ ఉండాలి. అంతేకాకుండా సినిమా లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, బే ఏరియా, చికాగో, మయామి మరియు అట్లాంటా.. లాంటి అమెరికా ప్రాంతాల్లో రిలీజయి కనీసం వారం రోజుల పాటు ఒకే థియేటర్ లో ఆడాలి. అలాగే కనీసం 40 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉండాలి. మరి ఇండియా నుంచి ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న ఈ సినిమాల్లో ఆస్కార్ నామినేషన్స్ కి ఏది వెళ్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు