×
Ad

Kamal Haasan : “పుష్పక విమానం”కి 35 ఏళ్ళు.. కమల్ హాసన్ ట్వీట్!

భారతీయ సినీ పరిశ్రమ మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో ముందుకు వెళుతున్న సమయంలో.. అసలు ఏమాత్రం మాటలు లేకుండా, ఒక స్టార్ హీరోని పెట్టుకొని బ్లాక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన 'పుష్పక విమానం' అప్పటిలో ఒక సంచలనం. ఇక ఈ సినిమా నవంబర్ 27తో 35 ఏళ్ళు పూర్తీ చేసుకోవడంతో, కమల్ హాసన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

  • Published On : November 28, 2022 / 09:10 PM IST

35 years for Pushpaka Vimana

Kamal Haasan : భారతీయ సినీ పరిశ్రమ మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో ముందుకు వెళుతున్న సమయంలో.. అసలు ఏమాత్రం మాటలు లేకుండా, ఒక స్టార్ హీరోని పెట్టుకొని బ్లాక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అప్పటిలో ఒక సంచలనం. కొత్త కొత్త హంగులు పూసుకుంటున్న సినీ రంగంలో మళ్ళీ వెనకటి కాలంనాటి పద్దతితో ఒక సినిమాను తీసుకు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అనే ప్రశ్నలకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది ఈ మూవీ.

Kamal Haasan : నేను బాగానే ఉన్నాను.. మరీ ఎక్కువ ప్రచారం చేసేస్తున్నారు..

సింగీతం శ్రీనివాసు తెరకెక్కించిన ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, అమల అక్కినేని హీరోయిన్ గా నటించారు. కామెడీ చిత్రాల్లో ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక మూవీలో హీరోహీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల చేత నవ్వులు పూయించడమే కాదు, వారిద్దరి ప్రేమని కూడా అనుభవించేలా చేస్తాయి. ముఖ్యంగా దర్శకుడు సింగీతం మృతదేహం చుట్టూ నడిపిన ప్రేమ సన్నివేశం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా నవంబర్ 27తో 35 ఏళ్ళు పూర్తీ చేసుకోవడంతో, కమల్ హాసన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. “నేను పని చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసు వయసులో పెద్దవాడు అయినా, కళ విషయంలో యవ్వన వయసు ఆలోచనలు ఉన్నవాడు. పుష్పక విమానంకి 35 ఏళ్ళు పూర్తీ అయ్యాయి. కానీ మీ ఆలోచన ధోరణికి మాత్రం వయసు అవ్వనివ్వకండి. నా లైఫ్ లో నేను విన్న బెస్ట్ మ్యూజిక్ మీ నవ్వు కూడా ఒకటి” అంటూ ట్వీట్ చేశాడు.