Kamal Haasan : నేను బాగానే ఉన్నాను.. మరీ ఎక్కువ ప్రచారం చేసేస్తున్నారు..

DSP ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ''ఒకప్పుడు పెద్ద ప్రమాదానికి గురయినా పరామర్శించి, తర్వాత మళ్ళీ ఎప్పుడు నటిస్తున్నారు అని అడిగేవారు. కానీ ఇప్పుడు చిన్నగా కాలు గీరుకుపోయినా పెద్దగా ప్రచారం చేసేస్తున్నారు...............

Kamal Haasan : నేను బాగానే ఉన్నాను.. మరీ ఎక్కువ ప్రచారం చేసేస్తున్నారు..

Kamal Haasan comments on his health

Updated On : November 28, 2022 / 8:08 AM IST

Kamal Haasan :  లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ విజయం సాధించి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ అస్వస్థతకి గురయి హాస్పిటల్ లో చేరారు. కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరారు అనడంతో ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే ఆయన కోలుకొని బయటకి వచ్చేశారు. తాజాగా కమల్ ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

విజయ్‌ సేతుపతి హీరోగా, పొన్‌రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన DSP సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని మరో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో కమల్ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

DSP ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ”ఒకప్పుడు పెద్ద ప్రమాదానికి గురయినా పరామర్శించి, తర్వాత మళ్ళీ ఎప్పుడు నటిస్తున్నారు అని అడిగేవారు. కానీ ఇప్పుడు చిన్నగా కాలు గీరుకుపోయినా పెద్దగా ప్రచారం చేసేస్తున్నారు. మీడియా, అభిమానం ఈ రెండూ దీనికి కారణం. నేను దగ్గు వచ్చి, జ్వరం వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అంతే. ప్రస్తుతం బాగున్నాను” అని తెలిపారు.

SJ Surya : పవన్‌కి హిట్ ఇచ్చాను.. మహేష్‌కి హిట్ ఇవ్వలేకపోయాను.. ఎప్పటికైనా మళ్ళీ మహేష్‌తో సినిమా చేస్తా..

ఇక విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ.. ”ఈ కార్యక్రమానికి విజయ్‌ సేతుపతి కోసమే వచ్చాను. తను కూడా నాలాగే సినీ ప్రేమికుడు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి” అని అన్నారు. ఇక ఈవెంట్ లో వేదికపై విజయ్‌ సేతుపతి మోకాళ్ల మీద కూర్చొని కమల్ కి పుష్పగుచ్ఛం ఇవ్వగా భవిష్యత్‌లో విజయ్ సేతుపతికి కూడా ఎవరో ఒకరు ఇలా ఇస్తారు అని అన్నారు కమల్. కమల్ బయట ఈవెంట్ లో కనపడి ఆరోగ్యంగానే ఉన్నాను అని తెలపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.