బుల్లితెర షూటింగులకు అనుమతినివ్వండి.. అలాగే చిన్న సినిమాలకు కూడా?..

టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు..

  • Published By: sekhar ,Published On : May 2, 2020 / 02:37 PM IST
బుల్లితెర షూటింగులకు అనుమతినివ్వండి.. అలాగే చిన్న సినిమాలకు కూడా?..

Updated On : May 2, 2020 / 2:37 PM IST

టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు..

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు టీవీ షూటింగులకు అనుమతులు ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పలు చానళ్ల ప్రతినిధులు కోరారు. శనివారం స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రసాద్‌ తదితరులు‌ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

టీవీ షూటింగులకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే టీవీ షూటింగులతో పాటు చిన్న సిినిమాల షూటింగ్స్‌కి కూడా పర్మిషన్ ఇస్తే మరికొంతమందికి ఉపాధి లభిస్తుందని ఛాంబర్ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఎఫ్‌డిసి ఛైర్మన్ తదితరులకు నిర్మాత నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు.