Al Pacino-Noor Alfallah
The Godfather Al Pacino: ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో(Al Pacino) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోని ఆయన నటనకు ఫిదా కాని వారంటూ దాదాపుగా ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన నాలుగో సారి తండ్రైయ్యారు. అది కూడా 83 సంవత్సరాల వయసులో కావడం గమనార్హం. గత కొంతకాలంగా ఆయన 29 ఏళ్ల ప్రొడ్యూసర్ అయిన నూర్ అల్ఫాల్లా(Noor Alfallah)తో సహజీవనం చేస్తుండగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారినికి ‘రోమన్ పాసినో’ అని పేరు పెట్టారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటీజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Adipurush : ఇది రామాయణం కాదు.. హనుమతుడి కోసం పెట్టిన సీట్ తీసేయండి!
నూర్ కంటే ముందు అల్ పాసినో ఇద్దరితో డేటింగ్ చేసి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. యాక్టింగ్ కోచ్ జాన్ టర్రాంట్‌తో సహజీవనం చేశాడు. వీరికి 1989లో జూలీ అనే పాప జన్మించింది. బిడ్డ పుట్టిన తరువాత కూడా పెళ్లి చేసుకోకుండా కొంతకాలానికే వీరిద్దరు విడిపోయారు. ఆ తరువాత అల్ పాసినో నటీ బెవర్లీ డియాంగితో 1997 నుంచి 2003 వరకు డేటింగ్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే.. వీరిద్దరి బంధం కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది.
ఇక ఇప్పుడు నూర్ అల్ఫల్లాతో డేటింగ్ చేసి మరోసారి తండ్రి అయ్యాడు. మరి ఇప్పటికైనా వివాహబంధంలోకి అడుగుపెడతాడో లేదో చూడాలి. ఇక నూర్ అల్ఫల్లా విషయానికి వస్తే ఆమె గతంలో ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, బిలియనీర్ నికోలస్ బెర్గ్రూస్‌తో డేటింగ్ చేసింది. 2022 నుంచి అల్‌పాసినో, నూర్ లు డేటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Salman Khan : సల్మాన్ ఖాన్ పెట్టుకునే బ్రాస్లెట్ వెనక కథ తెలుసా?