Aha: 90 డేస్.. 20 మూవీస్.. అలరించే షోలతో ఆహా అనాల్సిందే!

ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది.

Aha: 90 డేస్.. 20 మూవీస్.. అలరించే షోలతో ఆహా అనాల్సిందే!

Aha

Updated On : October 10, 2021 / 7:57 PM IST

Aha: ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. కరోనా లాక్ డౌన్ లో ప్రేక్షకులు డిజిటల్ ప్రసారాల వైపు మొగ్గు చూపడం ఎక్కువవడంతో ఆహా కూడా సరికొత్తగా అలరిస్తుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉండే ఆహా ఇప్పుడు దసరాను టార్గెట్ చేసి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

Lavanya Tripathi: ఒంపు సొంపుల నిధి ఈ అందాల రాక్షసి

ఆహా వీడియో దసరా పండగ సందర్భంగా ఇప్పుడు నాన్ స్టాప్ వినోదాల పండుగకి సిద్దం అయ్యింది. మొత్తం 12 వారాలు, 90 రోజులు, 20 కొత్త సినిమాలు మరియు షో లతో ఆహా వీడియో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసేందుకు సిద్ధమైంది. దసరా నుండి సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ మీ ఆహాలో సిద్దమా అంటూ ఆహా వీడియో చెప్పుకొచ్చింది.

Siddharth: సిద్దూ రీఎంట్రీ.. మళ్ళీ బిజీ అవుతాడా?

మొత్తం 90 రోజుల ఎంటర్టైన్మెంట్ షెడ్యూల్ లో ఇప్పుడు ఇంకా విడుదల కానీ సినిమాలతో పాటు ఈ మూడు నెలలలో వచ్చే కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అఖిల్ అక్కినేని-పూజ హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య, రాజ్ తరుణ్ అనుభవించు రాజా, వరుణ్ తేజ్ ల గని చిత్రాలు కూడా ఉండగా.. సరికొత్త షోలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా పండగకి సిద్దమైపొండి.