A fan who rode a bicycle for 1100 km to meet Salman Khan
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉంటారు. ఇటీవల ఈ కండల వీరుడు తన 57వ పుట్టినరోజు జరుపుకోగా.. శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎక్కడక్కడి నుంచో అభిమానులు సల్మాన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఒక వీరాభిమాని, సల్మాన్ ఖాన్ పై ఉన్న తన ప్రేమని వైవిధ్యమైన రీతిలో చాటుకున్నాడు.
Salman Khan : సల్మాన్ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్..
సల్మాన్ పుట్టినరోజున మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌కు చెందిన సమీర్ అనే అభిమాని.. తన అభిమాన హీరోని కలిసేందుకు దాదాపు 1100కి.మీ సైకిల్ తొక్కుకుంటూ ముంబై చేరుకున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఆ అభిమానిని ఆప్యాయంగా ఆహ్వానించి, అతనితో కాసేపు ముచ్చటించి, ఫోటోలు దిగి ఆ అభిమానిని సంతోషపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ఈ హీరో ప్రస్తుతం ‘కిసికా భాయ్ కిసికి జాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. విక్టరీ వెంకటేష్ పూజాకి అన్నయ్యగా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలోని ఒక పాటలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మెరవనున్నాడు.
This guy travelled from jabalpur to Mumbai by riding a cycle only just to meet his idol #salmankhan ❤️ pic.twitter.com/PRckJVPVfR
— Syed Parwez (@SyedParwez786) December 30, 2022