×
Ad

Sujeeth Cinematic Universe: ఓజీ యూనివర్స్ లోకి ప్రభాస్.. టైం ఫిక్స్ చేసిన సుజీత్

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో యూనివర్స్ క్రియేట్ చేయడం(Sujeeth Cinematic Universe) అనేది కామన్ గా మారిపోయింది. ఇప్పటికే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ LCU పేరుతో యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు.

A film with Pawan Kalyan and Prabhas as part of Sujeeth Cinematic Universe

Sujeeth Cinematic Universe: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో యూనివర్స్ క్రియేట్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది. ఇప్పటికే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ LCU పేరుతో యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ యూనివర్స్ లో వస్తున్న సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా PVCU పేరుతో తన యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. ఈ యూనివర్స్ లో హనుమాన్ సినిమా వచ్చింది. ఇప్పుడు జై హనుమాన్, మహాకాళి, అధీర సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

OG Title: ఏంటి.. ఓజీ పవన్ కళ్యాణ్ టైటిల్ కాదా.. మరి ఎవరికోసం అనుకున్నారు?

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి యూనివర్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు (Sujeeth Cinematic Universe)సుజీత్ ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. అయితే, ఈ సినిమాలో తన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు సుజీత్. గతంలో ఈ దర్శకుడు ప్రభాస్ తో సాహో సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను ఓజీ సినిమాతో లింక్ చేశాడు. ఓజీలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను కూడా చూపించాడు.

కాబట్టి, రానున్న రోజుల్లో ఈ యూనివర్స్ లో భాగంగా పవన్-ప్రభాస్ కాంబోలో సినిమా వస్తుంది అని ఆడియన్స్ ఆశ పడుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడి దగ్గర ప్రస్తావించగా.. “ప్రభాస్ అన్న నాకు చాలా దగ్గరైన వ్యక్తి. ఓజీ వల్ల పవన్‌ కల్యాణ్‌ సర్‌తో అనుబంధం ఏర్పడింది. ఈ యూనివర్స్‌ గురించి ఇప్పుడేం ఆలోచించలేదు. SCUలో ఈ ఇద్దరు హీరోల గురించి తర్వాత ఆలోచిస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రానున్న రోజుల్లో ఈ కాంబోలో తప్పకుండా వస్తుంది అంటూ ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు. మరి టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.