Sanjay Dutt : ఏకంగా 72 కోట్ల ఆస్తి ఫేవరేట్ హీరో పేరు మీద రాసి చనిపోయిన లేడీ ఫ్యాన్.. హీరో ఏం చేసాడో తెలుసా?
ఈ లేడీ ఫ్యాన్ ఏకంగా తనకున్న 72 కోట్ల ఆస్తి తన ఫేవరేట్ హీరో పేరు మీద రాసేసి అందర్నీ షాక్ కి గురి చేసింది.

A Lady fan of Sanjay Dutt before passing away left her assets in the name of Sanjay Dutt
Sanjay Dutt : ఫేవరేట్ హీరోల కోసం ఫ్యాన్స్ వేలకు వేలు డబ్బులు పెట్టి టికెట్స్ కొనుక్కొని సినిమా చూస్తారు, లేదా బ్యానర్స్ వేయిస్తారు, రిలీజ్ రోజు థియేటర్స్ లో రచ్చ చేస్తారు, పాలాభిషేకాలు చేయిస్తారు. కొంతమంది అయితే ఓ లక్ష రూపాయలు పెట్టి అన్నదానమో, ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తారు. కానీ ఈ లేడీ ఫ్యాన్ ఏకంగా తనకున్న 72 కోట్ల ఆస్తి తన ఫేవరేట్ హీరో పేరు మీద రాసేసి అందర్నీ షాక్ కి గురి చేసింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న సంజయ్ దత్ మధ్యలో కొన్ని కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లి రావడం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడం, అవకాశాలు రాకపోవడం.. ఇలా చాలా కష్టాలే చూసారు. ప్రస్తుతం మాత్రం నెగిటివ్స్ రోల్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. అయితే ముంబైకు చెందిన నిషా పాటిల్ అనే మహిళ చిన్నప్పటి నుంచి సంజయ్ దత్ కి వీరాభిమాని. ఆమె ఒక్కసారి కూడా సంజయ్ దత్ ని కలవలేదు. 2018లో ఆమె అనారోగ్యం బారిన పడటంతో ఆమె ఆస్తి అంతా తన తదనంతరం సంజయ్ దత్ కి చెందాలని వీలునామా రాసింది.
అయితే ఇటీవల నిషా పాటిల్ మరణించింది. 62 ఏళ్ళ వయసులో నిషా పాటిల్ మరణించడంతో ఆమె వీలునామా బయటపడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. లాయర్లు తాము చేయాల్సిన పని చేసి ఈ ఆస్తి తీసుకోవాలని సంజయ్ దత్ కి తెలిపారు. దీంతో ఈ విషయం సంజయ్ దత్ కి తెలిసి షాక్ అయ్యారు. నిషా పాటిల్ తనకెంత పెద్ద అభిమానో, ఆమె రాసిన వీలునామా గురించి తెలుసుకొని సంజయ్ దత్ మొదట షాక్ అయ్యారు. అనంతరం నాకు ఆ ఆస్తి వద్దని, తన లీగల్ టీమ్ తో మాట్లాడి ఆ ఆస్తి అంతా ఆమె కుటుంబ సభ్యులకు అందచేస్తానని తెలిపాడు సంజయ్ దత్. అలాగే.. అంత గొప్ప అభిమానిని కలవలేనందుకు బాధపడుతున్నాను అని, త్వరలో ఆమె కుటుంబ సభ్యులను కలుస్తాను అని తెలిపాడు.
Also Read : Sankranthiki Vasthunnam : ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎందుకో తెలుసా?
మొత్తానికి ఒక లేడీ ఫ్యాన్ చనిపోతూ తన ఆస్తి అంతా హీరో సంజయ్ దత్ కి ఇవ్వడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఆశ్చర్యానికి గురయింది. సంజయ్ దత్ కూడా ఆ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించి మళ్ళీ ఆస్తి అంతా ఆమె కుటుంబ సభ్యులకు ఇస్తానని చెప్పడంతో ఆయన్ని అభినందిస్తున్నారు. అయితే సంజయ్ దత్ గతంలో జైలుకు వెళ్లడం, అనారోగ్యానికి గురవడం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం వల్లే నిషా పాటిల్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.