Ram Charan : బాలీవుడ్ హిట్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. ఈ కాంబో అస్సలు ఊహించలే.. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి పండగే..
తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Ram Charan will Do a Movie with Bollywood Hit Director Nikhil Nagesh Bhat Rumors goes Viral
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా భారీ విజయం సాధించకపోయినా పర్వాలేదనిపించింది. సినిమా రిలీజ్ ముందు నుంచి నెగిటివ్ ప్రమోషన్స్ చేయడం. రిలీజ్ అయిన వెంటనే సినిమా లీక్ అవ్వడం, ట్రోల్స్ చేయడం.. ఇలా సినిమాకు బాగానే ఎఫెక్ట్ అయింది. చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు లో బిజీ అయిపోయాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. విలేజ్ యాక్షన్ డ్రామా కథ అని సమాచారం. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా వర్క్ వేగంగానే జరుగుతుంది. ఈ సినిమా తర్వాత RC17 సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. దీని తర్వాత పలువురు పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏ ప్రాజెక్టు ఓకే చేయలేదు.
అయితే తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ లో కిల్ అనే సూపర్ హిట్ యాక్షన్ సినిమా తీసిన నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మధు మంతెన నిర్మిస్తాడని, మన ఇండియన్ పురాణాల్లోంచి ఓ క్యారెక్టర్ తీసుకొని మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అని, ఆల్రెడీ డైరెక్టర్ నిఖిల్ నగేష్ స్టోరీ లైన్ రెడీ చేసాడని తెలుస్తుంది. రామ్ చరణ్ ఓకే అంటే ఈ సినిమా ముందుకెళ్లడమే అని అంటున్నారు.
Also Read : Sankranthiki Vasthunnam : ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎందుకో తెలుసా?
దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఓకే అయితే బాగుండు అని భావిస్తున్నారు. కిల్ సినిమా అందరికి తెగ నచ్చేసింది. డైరెక్టర్ నిఖిల్ నగేష్ కిల్ కాకుండా ఓ మూడు సినిమాలు, రెండు సిరీస్ లు కూడా డైరెక్ట్ చేసాడు. ఈ కాంబో అస్సలు ఊహించని అభిమానులు నిఖిల్ దర్శకత్వంలో భారీ మైథలాజికల్ సినిమా అనడంతో ఈ సినిమా ఓకే అవ్వాలని, చరణ్ ఓకే చెప్పాలని, అధికారికంగా సినిమా అనౌన్స్ చేయాలని ఎదురుచూస్తున్నారు. మరి రామ్ చరణ్ – నిఖిల్ నగేష్ భట్ సినిమా ఓకే అయితే మాత్రం అంచనాలు భారీగానే ఉంటాయి.