Naga Chaitanya – Shoyu : నాగ చైతన్య రెస్టారెంట్ ‘షోయు’ మీనింగ్ శోభిత కాదా? అసలు మీనింగ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నాగచైతన్య సినిమాలు కాకుండా ఓ క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ నడుపుతున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya – Shoyu : నాగ చైతన్య రెస్టారెంట్ ‘షోయు’ మీనింగ్ శోభిత కాదా? అసలు మీనింగ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Naga Chaitanya Gives Clarity on his Cloud Kitchen Business Shoyu Meaning

Updated On : February 11, 2025 / 7:02 PM IST

Naga Chaitanya – Shoyu : నాగచైతన్య ఇటీవలే తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 7న రిలీజయి ఇప్పటికే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 100 కోట్లకు పరుగులు పెడుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగచైతన్య యాక్టివ్ గానే పాల్గొన్నారు.

నాగచైతన్య సినిమాలు కాకుండా ఓ క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ నడుపుతున్న సంగతి తెలిసిందే. దానికి షోయు అనే పేరు పెట్టారు. ఈ రెస్టారెంట్ పెట్టి కూడా రెండెళ్లు దాటుతుంది. సమంతతో విడాకుల తర్వాతే ఈ క్లౌడ్ కిచెన్ ని మరో ముగ్గురితో కలిసి ప్రారంభించారు. అయితే షోయు అంటే అర్ధం ఇన్ని రోజులు శోభిత అని పలువురు భావించారు. షోయులో షో అంటే శోభిత అని మీమ్స్, వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు.

Also Read : Sankranthiki Vasthunnam : ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎందుకో తెలుసా?

షోయు అంటే రకరకాల అర్దాలు అనుకుంటున్నారు, మీరు కూడా వినే ఉంటారు, అసలు మీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఎందుకు పెట్టాలనుకున్నారు.. లాంటి పలు ప్రశ్నలు ఎదురవ్వగా నాగచైతన్య సమాధానమిస్తూ.. నాన్నకు కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. గతంలో నేను రెస్టారెంట్ చూసేవాడిని. అలా నాకు ఫుడ్ బిజినెస్ మీద ఆసక్తి వచ్చింది. కరోనాకు ముందు రెస్టారెంట్ పెడదాం అనుకున్నాం. నేను, నా మరో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేసుకున్నాం. కానీ కరోనాతో బిజినెస్ చాలా చేంజ్ అయింది. ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ లాంటివి ఎక్కువ అయ్యాయి. దాంతో నేను క్లౌడ్ కిచెన్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే షోయు క్లౌడ్ కిచెన్ పెట్టాము. షోయు అంటే జపనీస్ భాషలో సాయ్ సాస్ అనే పదార్థం. మేము వండే ఫుడ్స్ లో ఎక్కువగా వాడే పదార్థం అది. షోయు అంటే మీనింగ్ అంతే. షోయుకు హైదరాబాద్ లో ప్రస్తుతం 2 క్లౌడ్ కిచెన్స్, ఎయిర్ పోర్ట్ లో ఒకటి చిన్న రెస్టారెంట్ ఉంది. త్వరలో చెన్నై, బెంగుళూరు, ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నాం. క్లౌడ్ కిచెన్ తక్కువలో అవుతుంది. నాకు నా మెయిన్ ప్రొఫెషన్ యాక్టింగ్ నుంచి అప్పుడప్పుడు గ్యాప్ కావాలి. అందుకోసమే రెస్టారెంట్ లేదా రేసింగ్ చేసి కొంత రీఛార్జ్ చేసి మళ్ళీ వస్తాను అని తెలిపారు.

Also Read : Prabhas Sisters : ట్రెడిషినల్ గా ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు.. తల్లితో కలిసి.. ఫోటోలు వైరల్..

మొత్తానికి అందరూ అనుకున్నట్టు షోయు అంటే ఏవేవో మీనింగ్స్ కాకుండా సాయ్ సాస్ అనే ఒక పదార్థం పేరు అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ సమయానికి ఒక మంచి రెస్టారెంట్ పెట్టి అది మెయింటైన్ చేస్తూ, చెఫ్ గా చేసుకోవాలని చెప్పాడు. నాగచైతన్య మంచి చెఫ్ కూడా. అప్పుడప్పుడు తన క్లౌడ్ కిచెన్ లో కుక్ చేస్తారు కూడా.