A man died while watching kantara movie in theater
Kantara : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార సినిమా ఎంత పెద్ద భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదట కన్నడలో రిలీజయి హిట్ కొట్టక ఆ తర్వాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు. నేటికి కూడా ఈ సినిమా అన్ని చోట్ల హౌస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మరణించాడు. కర్ణాటక మాండ్య జిల్లా నాగమంగలలోని వెంకటేశ్వర థియేటర్లో కాంతార సినిమా చూడటానికి రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఉదయం ఆటకి వెళ్ళాడు. సినిమా చూస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్ చివర్లో ఛాతిలో నొప్పి అంటూ అక్కడికక్కడే కూలిపోయాడు. స్నేహితులు, థియటర్ యాజమాన్యం వెంటనే స్పందించి హాస్పిటల్ కి తరలించినా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే అతను మరణించినట్లు తెలిపారు.
Priyadarshi : కొమరం భీం బయోపిక్ లో నటించాలి.. వీళ్లందరి బయోపిక్స్ తీయాలి..
దీంతో అతని స్నేహితులు రాజశేఖర్ దేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పచెప్పారు. స్నేహితులతో సరదాగా సినిమాకి వెళ్లిన అతను అలా విగతజీవిగా రావడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.