Ram Charan : రామ్ చరణ్ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం.. ఏ సినిమా తెలుసా?

గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ సినిమాకి ఆస్కార్ అందుకున్న ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఇంతకీ ఏ సినిమానో తెలుసా?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం హాలిడే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఉపాసనతో కలిసి ఇటీవలే దుబాయ్ వెళ్లి వచ్చిన చరణ్.. ఈ శనివారం (ఏప్రిల్ 8) మాల్దీవ్స్ కి వెళ్లారు. ఇక ఈ టూర్ నుంచి తిరిగి వచ్చాక గేమ్ చెంజర్ (Game Changer) షూటింగ్ పాల్గొనున్నాడు. ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. RC15 తరువాత చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుందని ఇప్పటికే తెలియజేశారు.

Ram Charan – Upasana : మాల్దీవ్ వెకేషన్‌కు వెళ్లిన రామ్‌చరణ్‌ అండ్ ఉపాసన..

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా పూర్తి అయ్యిపోయినట్లు ఇటీవలే దర్శకుడు తెలియజేశాడు. కాగా ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఎ ఆర్ రెహమాన్ (A R Rahman) సంగీతం అందించబోతున్నాడని తెలుస్తుంది. ఆస్కార్ అందుకున్న రెహమాన్ గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న చరణ్ సినిమాకి సంగీతం ఇవ్వబోతున్నాడు అంటే అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే రెహమాన్ ని ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానం పలుకుతూ అధికారికంగా ప్రకటించనున్నారట.

Ram Charan : బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన చరణ్.. ఎందులోనో తెలుసా?

అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ ని (Janhvi Kapoor) ఎంపిక చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పట్టాలు ఎక్కించి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ కానుంది. ఇక శంకర్ అండ్ చరణ్ కలయికలో వస్తున్న గేమ్ చెంజర్ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారని సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు