A R Rahman : అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు.. ఎ ఆర్ రెహమాన్!

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు అంటూ బాధ పడ్డాడు.

A R Rahman : అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు.. ఎ ఆర్ రెహమాన్!

A R Rahman says wrong movies are sent to oscars from india

Updated On : March 17, 2023 / 10:00 AM IST

A R Rahman : ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు అంటూ బాధ పడ్డాడు. ఇండియా నుంచి రెండు ఆస్కార్ లను ఒకేసారి అందుకొని రికార్డ్ సృష్టించాడు రెహమాన్. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను రెహమాన్, గుల్జార్, రసూల్ పూక్కుట్టి ఒకేసారి అందుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు RRR ఆస్కార్ అందుకుంది. అయితే ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచేందుకు పెద్ద కథే జరిగింది.

Rajamouli Oscar Success Party : ఆస్కార్ తర్వాత స్పెషల్ పార్టీ అరేంజ్ చేసిన రాజమౌళి.. పియానో వాయించిన కీరవాణి.. సందడి చేసిన RRR టీం..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో ఆదరణ పొందింది. పాపులారిటీ మాత్రమే కాదు ఆస్కార్ కి వెళ్లే అర్హత కూడా ఉండడంతో.. భారత్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపిస్తుంది అని అందరూ భావించారు. కానీ RRR ని కాదని గుజరాతీ సినిమా లాస్ట్ ఫిలిం షోని ఆస్కార్ నామినేషన్స్ కి పంపించారు. అయితే ఆ సినిమా ఆఖరి బరిలో స్థానం దక్కించుకోలేక వెనక్కి తిరిగి వచ్చింది.

ఇక RRR ని ఎంపిక చేయకపోవడంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం పై హాలీవుడ్ మీడియా కూడా ప్రశ్నించింది. అయితే RRR టీం మాత్రం వెనకడుగు వెయ్యకుండా సొంతంగా ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యి రికార్డు సృష్టించింది. నామినేట్ అవ్వడమే కాదు ఆస్కార్ ని కూడా అందుకొని చరిత్ర లికించింది.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

అయితే RRR భారత్ ప్రభుత్వం నుంచి అధికారికంగా వెళ్లి ఉంటే బెస్ట్ మూవీ క్యాటగిరీ నామినేషన్స్ లో కూడా స్థానం దక్కించుకునేది అంటూ కొందరు అభిప్రాయం పడుతున్నారు. తాజాగా ఎ ఆర్ రెహమాన్ కూడా ఈ విషయాన్ని ఉద్దేశిస్తూనే ఇన్‌డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. ”మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. అర్హత లేని సినిమాలను పంపిస్తున్నారు అనిపిస్తుంది. బాధ అనిపిస్తున్నా, చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకపోతున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.