A R Rahman shares hindu marriage video held at Kerala Alappuzha Mosque
A R Rahman : ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సంగీతంతో ఆడియన్స్ ని స్వర్గంలో విహరించేలా చేస్తాడు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 2) సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. మొదటి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో థియేటర్ల కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని రికార్డు సృష్టిస్తుంది.
ఇదిలావుంటే, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. హిందూ సాంప్రదాయ పద్దతిలో మసీద్‌లో జరిగిన ఒక పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. అసలు కథ ఏంటంటే.. కేరళ అలప్పుజలోని చెరువల్లిలోని ఒక మహిళ తన కూతురు పెళ్లి చేయడానికి ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంది. దీంతో తన కూతురు పెళ్లికి సహాయం చేయాలంటూ అక్కడ మసీద్ కమిటీని ఆశ్రయించింది. ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్న మసీద్ పెద్దలు ఆమె కూతురు పెళ్లిని మసీద్ లోనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు.
Ram Charan : రామ్ చరణ్ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం.. ఏ సినిమా తెలుసా?
అంతేకాదు పెళ్ళికూతురికి 10 సవర్ల బంగారం, 20 లక్షల క్యాష్ ని పెళ్లి బహుమతిగా ఇచ్చారు. ఇక పెళ్లి వచ్చిన 1000 పైగా అతిథులకు వెజ్ అండ్ నాన్ వెజ్ విందు పెట్టి ఆనందపరిచారు. దేశంలో మతాలు పేరుతో జరుగుతున్న హింసని ఆపేలా మెసేజ్ ఇవ్వాలనే మసీద్ పెద్దలు ఈ పెళ్లిని ఇంత ఘనంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని రెహమాన్ ట్వీట్ చేస్తూ.. “మీ మానవత్వానికి జోహార్లు. బేధాలు లేకుండా చేసిన మీ పని వ్యవస్థని మార్చేలా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Bravo ?? love for humanity has to be unconditional and healing ❤️? https://t.co/X9xYVMxyiF
— A.R.Rahman (@arrahman) May 4, 2023