Mayasabha
Mayasabha : తాజాగా సోనీ లివ్ ఓటీటీలోకి ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ఆది పినిశెట్టి, చైతన్య రావు ముఖ్య పాత్రలుగా ఈ సిరీస్ దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నేడు ఈ సిరీస్ ని ప్రకటించి టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసారు.
ఈ టీజర్ చూస్తుంటే వైఎస్సార్- చంద్రబాబు నాయుడు కథతో తీసినట్టు తెలుస్తుంది. వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు అయినా మంచి మిత్రులు అని తెలిసిందే. ఇద్దరూ ఈ విషయాన్ని గతంలో పలుమార్లు తెలిపారు. ఈ ఇద్దరి పొలిటికల్ కెరీర్ ముందు, పాలిటిక్స్ లోకి వచ్చాక ఏం జరిగింది అనే కథాంశంతోని ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఆది పినిశెట్టి చంద్రబాబు పాత్రలో, చైతన్య రావు వైఎస్సార్ పాత్రలో కనిపించబోతున్నారు. మయసభ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
Also Read : Rajinikanth : తన మీద తనే కౌంటర్లు వేసుకున్న సూపర్ స్టార్.. 75 ఏళ్ళ వయసులో స్లో మోషన్ లో నడిచే నన్ను..
మీరు కూడా ఈ మయసభ టీజర్ చూసేయండి..