Rajinikanth : తన మీద తనే కౌంటర్లు వేసుకున్న సూపర్ స్టార్.. 75 ఏళ్ళ వయసులో స్లో మోషన్ లో నడిచే నన్ను..
తాజాగా రజినీకాంత్ ఓ బుక్ ఈవెంట్ కి హాజరవగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Rajinikanth
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ 75 ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పిస్తూ హిట్స్ కొడుతున్నారు. తాజాగా రజినీకాంత్ ఓ బుక్ ఈవెంట్ కి హాజరవగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
రజినీకాంత్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వారిని పిలవాలి. ఎందుకంటే వాళ్ళు నాకంటే మేధావులు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఆశ్చర్యపోయా. 75 ఏళ్ళ వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకొని స్లో మోషన్ లో నడిచే నన్ను ఎందుకు ఇలాంటి ఈవెంట్ కి పిలిచారు అనుకున్నాను అంటూ సరదాగా మాట్లాడారు. దీంతో సూపర్ స్టార్ అయి ఉండి తనపైనే కౌంటర్ వేసుకోవడం, వేరే స్టార్స్ ని పొగడటంతో రజినీకాంత్ సింప్లిసిటీని అభినందిస్తున్నారు.
అలాగే ఇదే ఈవెంట్లో రజినీకాంత్ మాట్లాడుతూ.. ఇటీవల నేను ఓ ఈవెంట్లో మాట్లాడిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మనం ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా విజ్ఞానమే అని అన్నారు.