×
Ad

Aadi Saikumar : రెండో సారి తండ్రి కాబోతున్న హీరో.. పోస్ట్ వైరల్.. త్వరలోనే సినిమా రిలీజ్..

తాజాగా హీరో ఆది తను రెండో సారి తండ్రి కాబోతున్నాడు అని ప్రకటించాడు. (Aadi Saikumar)

Aadi Saikumar

Aadi Saikumar : సాయి కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది మొదట్లో హీరోగా వరుస సక్సెస్ లు కొట్టాడు. గత కొన్నాళ్ళుగా మాత్రం వరుస ఫ్లాప్స్ చూస్తూ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆది సాయికుమార్ శంబాలా సినిమాతో డిసెంబర్ 25 న థియేటర్స్ లోకి రానున్నాడు. ప్రస్తుతం ఆది ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.(Aadi Saikumar)

తాజాగా హీరో ఆది తను రెండో సారి తండ్రి కాబోతున్నాడు అని ప్రకటించాడు. ఆది – అరుణ జంట 2014 లో పెళ్లి చేసుకోగా వీరికి అయాన అనే కూతురు ఉంది. ఇప్పుడు రెండో సారి తండ్రి కాబోతున్నాడు ఆది.

Also Read : Tollywood Heros : నిజంగా జరిగితే ఎంత బాగుండో.. స్టార్ హీరోలు ఒకే చోట చాయ్ తాగుతూ.. వైరల్ అవుతున్న AI ఫొటోలు..

తాజాగా ఆది, తన భార్య అరుణ, తన కూతురు ముగ్గురు చేతులు చూపిస్తున్న ఫోటోని షేర్ చేసి.. 3 + 1 = 4 . చిన్ని పాదాలు జనవరి 2026 లో రాబోతున్నాయి. కొత్త పర్సన్ ని ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నాం అని తెలిపాడు. దీంతో జనవరి 2026 లో ఆది భార్య డెలివరీ కానుందని తెలుస్తుంది. ఈ జంటకు ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Mahesh Babu Vs Allu Arjun : మహేష్ బాబుతో పోటీకి అల్లు అర్జున్.. రాజమౌళి వర్సెస్ అట్లీ.. బన్నీ సినిమా రిలీజ్ ఫిక్స్..