దట్టమైన అడవుల్లో ఆకాశవాణి

పాడేరు అడవుల్లో 50 రోజుల భారీ షెడ్యూల్ జరుపుకున్నఆకాశవాణి..

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 07:11 AM IST
దట్టమైన అడవుల్లో ఆకాశవాణి

పాడేరు అడవుల్లో 50 రోజుల భారీ షెడ్యూల్ జరుపుకున్నఆకాశవాణి..

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మూవీ.. ఆకాశవాణి.. ఈగ, బాహుబలి సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. ఇటీవలే పాడేరు అడవుల్లో 50 రోజుల భారీ షెడ్యూల్ చేసారు. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది.

దట్టమైన అడవిలో ఓ రేడియో చుట్టూ సాగే కథ ఇది.. పాడేరు అడవిలో వేసిన భారీ సెట్‌లో దాదాపు 50 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేసి, చాలా క్రిటికల్ సీన్స్ పిక్చరైజ్ చేసాం.. ఈ షెడ్యూల్ అడ్వెంచరస్‌గా సాగింది.. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా కంప్లీట్ అయ్యింది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.. అని దర్శకుడు చెప్పాడు.. ఈ సినిమాకి కెమెరా : సురేష్ రగుతు, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : కాల భైరవ, మాటలు : సాయి మాధవ్ బుర్రా, స్క్రీన్‌ప్లే : అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయి కుమార్ రెడ్డి, కథ, దర్శకత్వం : అశ్విన్ గంగరాజు.