Ira Khan : అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి.. ప్రియుడితో కూతురి పెళ్లి

ఐరా ఖాన్-నూపుర్ శిఖరే పెళ్లికి బాజా మోగింది. ఈ జంట ఈరోజు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ముంబయి బాంద్రాలో వీరి వివాహం చాలా సింపుల్‌గా జరగబోతోంది.

Ira Khan

Ira Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి వేడుక ఈరోజు సాయంత్రం జరగనుంది. ఈ జంట చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఐరా ఖాన్-నూపుర్ శిఖరే జంట పెళ్లిపీటలెక్కుతున్నారు. ముంబయి బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ లో ఈరోజు సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హల్దీ వేడుకలు జరిగాయి. కాగా.. పెళ్లి తర్వాత జైపూర్‌లో జరగనున్న రిసెప్షన్‌కి బాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అవుతారని తెలుస్తోంది.

Also Read : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ‘టైసన్ నాయుడు’ గ్లింప్స్ రిలీజ్..

సోమవారం సాయంత్రం నుండి అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. పువ్వులు లైట్లతో ఇంటిని అలంకరించారు. అతిథులు మహారాష్ట్ర సంప్రదాయంలో హాజరైనట్లు కనిపించింది. అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రాయ్‌లు పిల్లలతో పాటు తరలివచ్చారు. రీనా దత్తా కూతురే ఐరా ఖాన్.

Also Read : ఈ తెలుగు హీరోలు 2024లో అయినా హిట్ కొడతారా?

నూపుర్ శిఖరే అమీర్ ఖాన్ ఫిట్ నెస్ కోచ్.. కాగా ఐరాకు 2020 లో నూపుర్ పరిచయమయ్యారు. ఐరా బాగా డిప్రెషన్‌లో ఉన్న టైమ్‌లో నూపుర్ ఆమెకు అండగా ఉన్నారు. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో చాలాకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఈరోజు వీరి ప్రేమ కధకు పెళ్లితో ఎండ్ కార్డ్ పడబోతోంది.