Telugu Heros : ఈ తెలుగు హీరోలు 2024లో అయినా హిట్ కొడతారా?

2024 అయినా ఈ హీరోల్ని కనికరిస్తుందా..? ఫ్లాపులనుంచి బయటపడేసి కావల్సిన సక్సెస్ ఇస్తుందా చూడాలి.. ఇంతకీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆ హీరోలు ఎవరంటే..

Telugu Heros : ఈ తెలుగు హీరోలు 2024లో అయినా హిట్ కొడతారా?

Will these Telugu heroes hit even in 2024 with Their Movies

Telugu Heros : ఒక సినిమాతో హిట్ రాకపోతే జానర్ మార్చి ట్రై చేస్తారు. కానీ ఏ జానర్ చేసినా కొంతమంది హీరోలకు ఇటీవల సక్సెస్ రావడం కష్టమే అయింది. సక్సెస్ రేట్ లేకపోయినా సినిమాలు చేస్తున్నారు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నారు. మరి ఈ 2024 అయినా ఈ హీరోల్ని కనికరిస్తుందా..? ఫ్లాపులనుంచి బయటపడేసి కావల్సిన సక్సెస్ ఇస్తుందా చూడాలి.. ఇంతకీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆ హీరోలు ఎవరంటే..

ఈ సంవత్సరం హిట్ గ్యారంటీగా కొట్టి తీరాల్సిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). గీతగోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండని వరసగా ఫ్లాపులు మాత్రం వదలడం లేదు. డిఫరెంట్ జానర్స్ ట్రై చేసినా హిట్ మాత్రం కనీసం దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. అలా నోటా, డియర్ కామ్రేడ్, లైగర్ తో పరాజయాలు అందుకున్నాడు. సమంతతో చేసిన ఖుషీ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్’ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్. విజయ్, పరశురామ్ కాంబినేషన్లో ఆల్రెడీ చేసిన గోతగోవిందం 100 కోట్లు కలెక్ట్ చెయ్యడంతో ఇదే కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఈ సారి సాలిడ్ సక్సెస్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ.

2021లో వచ్చిన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల తర్వాత నాగచైతన్య(Naga Chaitanya) రెండేళ్ల నుంచి సరైన హిట్ కొట్టలేదు. ఈ మధ్య లో వచ్చిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా పరాజయాలు పాలవ్వగా కస్టడీ విమర్శకులని మెప్పించిన కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. అయితే ఈ సారి గ్యారంటీ గా హిట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకుని తండేల్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. చందూమొండేటి డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో తండేల్ మూవీ పవర ఫుల్ సబ్జెక్ట్ తో సాయపల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతోంది.

క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్(Ram) 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్, వారియర్, స్కంద సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. అందుకే మరోసారి పూరీజగన్ డైరెక్షన్లోనే డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చిలో రిలీజవుతోంది. ఈ సినిమా అయినా రామ్ కి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

Also Read : Hanuman : ‘హనుమాన్’ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం విన్నారా.. గూస్ బంప్స్ గ్యారెంటీ..

దాదాపు 7,8 ఏళ్ల నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్(Gopichand). కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకుంటున్నా సక్సెస్ మాత్రం రానంటోంది. ఈ గ్యాప్ లో సీటీ మార్, పక్కా కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ సారి ‘భీమ’గా సక్సెస్ మీద ధీమాతో రాబోతున్నారు. దాంతో పాటు శ్రీనువైట్ల డైరెక్షన్లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నారు.

నితిన్(Nithin) 3 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈమధ్య యాక్షన్ సినిమాలతో ప్రయోగాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోయాయి. 2020లో వచ్చిన భీష్మ తర్వాత రంగ్ దే పర్వాలేదనిపించినా చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజైన ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. సో మరి ఈ సంవత్సరం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వస్తున్న తమ్ముడు, వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా అయినా హిట్ ఇస్తాయని అనుకుంటున్నాడు నితిన్.

2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత.. గని, గాండీవధారి అర్జున సినిమాలు అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్(Varun Tej) కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన ఎఫ్ 3 పర్వాలేదనిపించినా వరుణ్ కి పెద్ద క్రెడిట్ ఏం తెచ్చిపెట్టలేదు. ఈమధ్య కామెడీని పక్కనపెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆపరేషన్ వాలంటైన్ మూవీ ఫిబ్రవరి లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లో పడతాడేమో చూడాలి వరుణ్ తేజ్.

5 ఏళ్ల నుంచి హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు నాగశౌర్య. చలో తర్వాత వచ్చిన అన్ని సనిమాలు అడ్రస్ లేకుండా పోవడంతో ఈ సంవత్సరం తీసే సినిమాల్ని జాగ్రత్తగా అన్ని హిట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. పోలీస్ వారి హెచ్చరిక, నారినారినడుమ మురారి మూవీతో పాటు తన 24వ సినిమా షూట్ చేస్తున్న శౌర్య.. ఈ సంవత్సరం హిట్ మీద ఆశలతో ఉన్నాడు.

Also Read : Lavanya Tripathi : పెళ్లి తర్వాత ఫస్ట్ వెబ్ సిరీస్‌తో రాబోతున్న లావణ్య త్రిపాఠి.. ఏం సిరీస్? ఏ ఓటీటీలో ?

అసలు హిట్ , ఫ్లాప్ ని పట్టించుకోకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు ఈ సారి చేస్తున్న హరోంహరతో హిట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 14 ఏళ్ల సినిమా కెరీర్ లో ఏదో 3, 4 సినిమాలు తప్ప ఫ్లాపులు, యావరేజ్ తోనే సరిపెట్టుకుంటున్న సుధీర్ బాబు 2023 లో వచ్చిన హంట్, మామామశ్చీంద్రతో కూడా హిట్ కొట్టలేకపోయారు. కానీ ఈ సంవత్సరం రాబోతున్న ఇంట్రస్టింగ్ థ్రిల్లర్ హరోంహరతో గ్యారంటీగా సక్సెస్ కొడతానంటున్నారు. వీళ్ళతో పాటు చిన్నా చితక హీరోలు కూడా ఇంకొంతమంది ఉన్నారు. మరి హిట్ మీద ఇన్ని ఆశలుపెట్టుకున్న ఈ హీరోలకి ఈ సంవత్సరం అయినా కనికరిస్తుందో లేదో చూడాలని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.