Sreenivas Bellamkonda : ‘టైసన్ నాయుడు’ ఇదెక్కడి అరాచకంరా బాబు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..

తాజాగా నేడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు.

Sreenivas Bellamkonda : ‘టైసన్ నాయుడు’ ఇదెక్కడి అరాచకంరా బాబు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..

Sreenivas Bellamkonda 10th Movie Title and First Glimpse Released Movie Titled as Tyson Nyidu

Updated On : January 3, 2024 / 2:11 PM IST

Sreenivas Bellamkonda : బెల్లంకొండ్ర శ్రీనివాస్ తో భీమ్లా నాయక్(Bheemla Nayak) దర్శకుడు సాగర్ చంద్ర(Sagar Chandra) సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది శ్రీనివాస్ కి 10వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.

ఇటీవలే సాయి శ్రీనివాస్ VV వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ లో ఛత్రపతి(Chatrapathi) రీమేక్ చేసి పరాజయం చూశాడు. కెరీర్ లో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలు తీసిన శ్రీనివాస్ ఇప్పుడు రాబోయే సినిమా కూడా మాస్ సినిమా అని తెలుస్తుంది. తాజాగా నేడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు.

Also Read : Telugu Heros : ఈ తెలుగు హీరోలు 2024లో అయినా హిట్ కొడతారా?

ఈ సినిమాకు టైసన్ నాయుడు అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీనివాస్ DSP గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక గ్లింప్స్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని పెట్టారు. ఇందులో శ్రీనివాస్ అదరగొట్టాడు. ఇక బాక్సింగ్ రింగ్ లో కూడా గెలిచి టైసన్ నాయుడు అనిపించుకున్నాడు. టైటిల్ అయితే కొత్తగా ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.