Aamir Khan : తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పై అప్డేట్ ఇచ్చిన అమీర్ ఖాన్..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి అదిరిపోయే ప్రకటన చేశాడు.

Aamir Khan gave an update on his dream project Mahabharatham

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి అదిరిపోయే ప్రకటన చేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ మహాభారతం చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇది చాలా ‘భయంకరమైనది’ అని అన్నారు. భారతదేశంలో ఇలాంటి పౌరాణిక ప్రాజెక్ట్ చేయడం చాలా పెద్ద బాధ్యత అని, అందుకే అది పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

అంతేకాదు మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే భారతీయులుగా ఇది మన మనసుకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి నేను దానిని సరిగ్గా చేయాలనుకుంటున్నాను అని తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా మహాభారతం చేయాలనుకుంటున్నాను అని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో భారతదేశం ఏంటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను దీనికోసం ఎంతో కష్టపడానికి రెడీ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : Bigg Boss 8 winner Nikhil : బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ బ్యాగ్రౌండ్ తెలుసా..

అయితే 2018లో, అమీర్ ఖాన్ మహాభారతంపై పనిచేస్తున్నట్లు రచయిత అంజుమ్ రాజబలి ఒక కార్యక్రమంలో తెలిపారు. ఇక ఇప్పుడు స్వయంగా అమీర్ ఖాన్ దీని గురించి చెప్పాడు. మరి దీనికి సంబందించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇక 1000 కోట్ల బడ్జెట్‌తో మహాభారతం రూపొందనుందని సమాచారం.