Atlee Kumar : తన లుక్ ను ఎగతాళి చేస్తూ కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అట్లీ..
తాజాగా 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు అట్లీ.

Kapil Sharma shocking comments on Atlee looks
Atlee Kumar : తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జవాన్ సినిమాతో ఆయన సృష్టించిన సంచలం గురించి ఎంత చెప్పినా తక్కువే. జవాన్ సినిమా కంటే ముందు పలు సినిమాలు చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచుకున్నప్పటికీ జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.
అయితే ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు మేకర్స్. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు అట్లీ. ఇందులో అట్లీని అవమానించేలా మాట్లాడాడు కపిల్. ” మీరు కథ చెప్పడానికి ఏ స్టార్ దగ్గరికి అయినా వెళ్లినప్పుడు.. మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా అని కపిల్ అడిగాడు. ఆయన ఏ ఉద్దేశంతో తనని ఈ ప్రశ్న అడిగాడో తెలిసిన అట్లీ కపిల్ కి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు.
Also Read : Amritha Aiyer : ‘నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా.. కానీ’.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హనుమాన్ హీరోయిన్..
మీరు నన్ను ఈ ప్రశ్న ఎందుకు అడిగారో నాకు తెలుసు. దీనికి నేను ఒకటే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. మనలో టాలెంట్ ఉంటే మనం ఎలా ఉన్నామన్నది అనవసరం. దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. నిజానికి నేను.. నన్ను నమ్మిన మురుగదాస్ సర్ కి థాంక్స్ చెప్పాలి. ఆయనకి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన నా టాలెంట్ చూసారు తప్ప నేను ఎలా ఉన్నానో చూడలేదు. నాపై ఉన్న నమ్మకంతో నా సినిమాను నిర్మించారు. కాబట్టి ప్రపంచం కూడా మనలో ఉన్న మన టాలెంట్ నే చూడాలి. మనం ఎలా ఉన్నది కాదు. రూపాన్ని బట్టి మనిషిని కాదు” అంటూ కపిల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
కలీస్ దర్శకత్వం వహించిన బేబీ జాన్ యాక్షన్ డ్రామా సినిమాలో వరుణ్ ధావన్ , కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తలపతి విజయ్‌తో కలిసి అట్లీ చేసిన తేరి సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది.